WPL 2023: ఎట్టకేలకు బెంగళూరుకు విజయం..
WPL 2023: ఎట్టకేలకు బెంగళూరుకు విజయం..
WPL 2023: మహిళల ప్రిమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎట్టకేలకు విజయం వరించింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న RCB.. యూపీ వారియర్స్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు.. 19.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని స్మృతి మంధాన సేన.. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.