Rashid Latif Slams Sourav Ganguly గంగూలీపై పాక్ మాజీ ఆటగాడు తీవ్ర విమర్శలు .. పవర్ చూపిస్తానడంటూ..
Rashid Latif Slams Sourav Ganguly: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆసియా కప్ 2020 ని వాయిదా వేస్తున్నట్లుగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Rashid Latif Slams Sourav Ganguly: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆసియా కప్ 2020 ని వాయిదా వేస్తున్నట్లుగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే దీనికంటే ఒక్కరోజు ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లధించాడు. దీనితో గంగూలీ పైన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గంగూలీ తన పవర్ చూపించడానికి మాత్రమే ఏసీసీ కంటే ముందు ఆసియా కప్ రద్దు విషయాన్ని వెల్లడించాడని రషీద్ లతీఫ్ విమర్శించాడు.
'ఆసియా కప్‌ని ఈ ఏడాది రద్దు చేయాలా లేదా నిర్వహించాలా..? అనే విషయాన్ని నిర్ణయించాల్సింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. కానీ.. సౌరవ్ గంగూలీ మితిమీరిన బలం చూపించడం ద్వారా ఆసియా క్రికెట్ దేశాల్ని హర్ట్ చేశాడు. అతను భారత క్రికెట్, ఐపీఎల్‌పై శ్రద్ధ పెడితే మంచిది'' అంటూ రషీద్ లతీఫ్ చెప్పుకొచ్చాడు.. మరి ఈ వ్యాఖ్యలపై గంగూలీ ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి మరి..
ఆసియా కప్ వచ్చే ఏడాదికి వాయిదా!
ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సిన ఆసియాకప్ 2020ను వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధికారిక ప్రకటనను వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఏసీసీ స్పష్టం చేసింది. " ఈ సమయంలో ఆసియాకప్ నిర్వహిస్తే ఆటగాళ్ల ఆరోగ్యంతో పాటు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి.. ఆసియా కప్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్ణయించాం " అని ఏసీసీ ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌ని వచ్చే ఏడాది జూన్ లో నిర్వహిస్తామని, అయితే దీనికి గాను పాకిస్థాన్ స్థానంలో శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నట్లు (ఏసీసీ) తన ప్రకటనలో పేర్కొంది.