Rajasthan Royals's Fielding Coach Tests Positive: రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్‌కు కరోనా
Rajasthan Royals's Fielding Coach Tests Positive: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్ రాయల్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్‌కు కరోనా సోకిందని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది.
Rajasthan Royals's Fielding Coach Tests Positive: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్ రాయల్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్‌కు కరోనా సోకిందని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ ఫ్రాంచైజీ అయినా తమ జట్టును యూఏఈకి తరలించే ముందు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించాలి. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం దుబాయ్‌కి వెళ్లేందుకు ముంబైలో సమావేశం కావాలనుకున్న రాజస్థాన్ టీమ్.. అందరిని కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆదేశించింది.
ఈ క్రమంలో దిషాంత్ యగ్నిక్ కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటీవ్ వచ్చింది.ప్రస్తుతం కోచ్ దిషాంత్ యగ్నిక్ తన స్వస్థలమైన ఉదయపూర్ లో ఉన్నారని తెలిపింది. అతనికి కరోనా రావడంతో ఆసుపత్రిలో చేరి 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ప్రాంచైజీ సూచించింది. జట్టు సభ్యులెవరూ కోచ్ తో సన్నిహితంగా లేరని ప్రాంచైజీ నిర్వాహకులు వెల్లడించారు. క్వారంటైన్ అనంతరం దిశాంత్‌కు రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. ఆ టెస్ట్‌ల్లో నెగటీవ్ వస్తే.. యూఏఈకి పంపిస్తామని, అక్కడ కూడా మరో 6 రోజుల క్వారంటైన్‌లో ఉంచి, మరో సారి పరీక్షిస్తామని, ఆ టెస్టుల్లో నెగటివ్ వస్తే జట్టుతో కలవడానికి అనుమతిస్తామని రాజస్థాన్ రాయల్స్ పేర్కొంది.