ద్రవిడ్ బెస్ట్.. సచిన్, కోహ్లీలకు షాకిచ్చిన విజ్డెన్ ఇండియా

గత 50 ఏళ్లలో భారత క్రికెట్‌ సుదీర్ఘ ఫార్మాట్ లో గొప్ప బ్యాట్స్‌మెన్‌ ఎవరు..? అనగానే మొదట వినిపించే పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ ఇలా వరుసగా చెప్తారు.

Update: 2020-06-24 15:22 GMT

గత 50 ఏళ్లలో భారత క్రికెట్‌ సుదీర్ఘ ఫార్మాట్ లో గొప్ప బ్యాట్స్‌మెన్‌ ఎవరు..? అనగానే తొలుత వినిపించే పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ ఇలా వరుసగా చెప్తారు. ఇదే ప్రశ్నతో విజ్డెన్ ఇండియా ఓ పోల్‌ని నిర్వహించగా ద్రవిడ్ విజేతగా నిలిచాడు.

భారత్ తరఫున రాహుల్ ద్రవిడ్ 164 టెస్టులాడి 52.31 సగటుతో 13,288 రన్స్ చేయగా.. 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 53.78 యావరేజ్ తో 15,921 పరుగులు చేశాడు. ఇక సునీల్ గవాస్కర్ 125 టెస్టుల్లో 51.12 సగటుతో 10,122 పరుగులు చేశాడు. టీమిండయా సారథి విరాట్ కోహ్లీ 86 టెస్టుల్లోనే 53.62 సగటుతో 7,240 పరుగులు చేశాడు.

అయితే విజ్డెన్ ఇండియా నిర్వహించిన పోల్‌లో మొత్తం 11,400 మంది అభిమానులు తమ అభిప్రాయాన్ని చెప్పగా.. రాహుల్ ద్రవిడ్‌కి ఏకంగా 52 శాతం మద్దతు పలికినట్లు విజ్డెన్ ఇండియా ప్రకటించింది. సచిన్, ద్రావిడ్ కు పోటీ ఇచ్చినా పరితమైనట్లు విజ్డెన్ ఇండియా వెల్లడించింది. విరాట్ కోహ్లీ, సునీల్‌ గవాస్కర్ వరుసగా మూడు, నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నారు. 

Tags:    

Similar News