PV Sindhu: ప్రస్తుత ఒలింపిక్స్‌లో మెడల్ రంగు మారుస్తా
PV Sindhu: పారిస్ వేదికగా జరగబోయే ఒలింపిక్స్ 2024 కోసం ఎంపికైన అథ్లెట్లతో ప్రధాని గురువారం భేటీ అయ్యారు. ఈ క్రమంలో పీవీ సింధుతో ప్రధాని మోదీ వీడియో కాల్ ద్వారా చిట్ చాట్ చేశారు.
PV Sindhu: పారిస్ వేదికగా జరగబోయే ఒలింపిక్స్ 2024 కోసం ఎంపికైన అథ్లెట్లతో ప్రధాని గురువారం భేటీ అయ్యారు. ఈ క్రమంలో పీవీ సింధుతో ప్రధాని మోదీ వీడియో కాల్ ద్వారా చిట్ చాట్ చేశారు. కొత్తగా ఒలింపిక్స్‌లో ఆడుతున్న వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని పీవీ సింధును మోదీ కోరారు. మొదటిసారి ఒలంపిక్స్ ఆడుతున్న వారికి చాలా టెన్షన్, భయంగా, నర్వస్ గా ఉంటుందని.. ఆ సమయంలో టెన్షన్ పడకుండా ఆడుతున్న ఆటపై ఫోకస్ గా ఉండాలని అన్నారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే అది ఆటపై ప్రభావం చూపుతుందని పీవీ సింధు సూచించారు.
పారిస్ ఒలింపిక్స్ తనకు మూడవది అని తెలుగు తేజం పీవీ సింధు తెలిపారు. మొదటి ఒలింపిక్స్‌లో సిల్వర్, రెండో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ వచ్చిందని... ఈసారి మెడల్ రంగును మార్చాలని అనుకుంటున్నట్లు మోడీకి సింధు చెప్పారు. ఒలింపిక్స్ ఆటడం అంత సులువేం కాదని... ఎంతో ఉత్సాహంగా ఉన్నానని... అదే సమయంలో తన దృష్టంతా గేమ్‌పైనే ఉందన్నారు.