Paris Olympics 2024: గోల్డ్ మెడలిస్ట్​తో లక్ష్యసేన్ పోటీ..

Paris Olympics 2024: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో జోరుమీదున్నాడు. సూపర్ ఫామ్​తో సెమీఫైనల్​కు దూసుకెళ్లాడు.

Update: 2024-08-03 15:30 GMT

Paris Olympics 2024: గోల్డ్ మెడలిస్ట్​తో లక్ష్యసేన్ పోటీ..

Paris Olympics 2024: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో జోరుమీదున్నాడు. సూపర్ ఫామ్​తో సెమీఫైనల్​కు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​ఈవెంట్లో సెమీస్ ఫైనల్​కు అర్హత సాధించిన తొలి భారత​షట్లర్​గా లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్​లో తైవాన్ షట్లర్ చో చెన్‌ పై విజయం సాధించి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. ఇక రాబోయే మ్యాచ్​ల్లో కూడా ఇలాగే అదరగొట్టి పతకాన్ని పట్టేయాలని భారత్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కీలమైన సెమీస్​పోరులో లక్ష్యసేన్ డెన్మార్క్ షట్లర్ విక్టర్ ఆక్సెల్సెన్ తో తలపడనున్నాడు. ఆక్సెల్సెన్​కూడా ఈ ఒలింపిక్స్​లో ఓటమి లేకుండా సెమీస్​కు దూసుకొచ్చాడు. అతడు గ్రూప్ స్టేజ్​లో నేపాల్, ఇజ్రాయెల్, ఐర్లాండ్ ప్లేయర్లపై గెలిచాడు. కాగా, క్వార్టర్ ఫైనల్​లో సింగపుర్ షట్లర్ కే వై లోక్​పై విజయం సాధించి జోరుమీదున్నాడు. అంతేకాకుండా 2020 ఒలింపిక్స్ పరుషుల బ్యాట్మింటన్ సింగిల్స్​లో విక్టర్ ఆక్సెల్సెన్ స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. దీంతో సెమీఫైనల్​లో లక్ష్యసేన్​కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

రేపు జరగనున్న సెమీస్​లో లక్ష్యసేన్ విజయం సాధిస్తే పతకం ఖరారవుతుంది. అతడు ఫైనల్​పోరులో స్వర్ణ పతకం కోసం పోటీపడాల్సి ఉంటుంది. ఒకవేళ సెమీ ఫైనల్​లో లక్ష్య ఓడితే కాంస్యం కోసం ఆడాల్సి ఉంటుంది. కాగా, ఈ ఒలింపిక్స్‌లో భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ నిరాశపర్చారు. ప్రీ క్వార్టర్స్‌లో సింధు ఓడగా, క్వార్టర్స్‌లో సాత్విక్- చిరాగ్ శెట్టి జోడీ నిష్క్రమించింది. దీంతో భారతీయుల అంచనాలన్నీ ఆశలన్నీ లక్ష్యసేన్‌పైనే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా లక్ష్యసేన్ సెమీస్‌కు చేరాడు. ఇదే జోరును సెమీస్‌లో కొనసాగిస్తే.. పతకం గ్యారెంటీగా తీసుకొచ్చే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. 

Tags:    

Similar News