Paris Olympics 2024: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి షికార్లు.. కట్‌చేస్తే.. ఒలింపిక్స్ నుంచి స్మిమ్మర్ ఔట్..!
Brazilian Swimmer Ana Carolina Vieira: బ్రెజిలియన్ స్విమ్మర్ అనా కరోలినా వియెరా పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి తప్పించారు.
Brazilian Swimmer Ana Carolina Vieira: బ్రెజిలియన్ స్విమ్మర్ అనా కరోలినా వియెరా పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి తప్పించారు. జట్టు కోచ్ అనుమతి తీసుకోకుండానే ఆమె తన ప్రియుడు, తోటి ఆటగాడితో కలిసి ఒలింపిక్స్ అథ్లెట్ విలేజ్ నుంచి బయటకు వెళ్లింది. ఇదేంటని కోచ్ ప్రశ్నించగా.. చాలా కోపంగా బదులిచ్చిందంట. ఈ విషయం బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ (COB)కి చేరింది. ఆ తర్వాత COB కీలక చర్య తీసుకోవడంతో.. ఆమెను ఒలింపిక్ క్రీడా గ్రామం నుంచి బయటకు పంపిచేశారు.
హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం , అన్నా కరోలినా జులై 26న ఒలింపిక్స్ అథ్లెట్ గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయింది. మరుసటి రోజు అన్నా 4x100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్‌లో పాల్గొనాల్సి వచ్చింది. కరోలినా మ్యాచ్‌లో పాల్గొని 12వ స్థానంలో నిలిచింది. అయితే, ఆమె ప్రియుడు గాబ్రియేల్ శాంటోస్ పురుషుల జట్టు 4x100 ఫ్రీస్టైల్ ఈవెంట్ మ్యాచ్‌లో ఓడిపోయాడు.
బ్రెజిలియన్ స్విమ్మింగ్ టీమ్ హెడ్ గుస్తావో ఒట్సుకా కరోలినా అనుచిత ప్రవర్తన గురించి COBకి తెలియజేశాడు. దీంతో అనా కరోలినా ప్రవర్తనపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆమె ప్రియుడు మాత్రం ఒలింపిక్స్ కమిటీకి క్షమాపణలు చెప్పడంతో.. ఒక హెచ్చరికతో మన్నించారు. దీంతో కరోలినా వెంటనే బ్రెజిల్‌కు తిరిగి వెళ్లింది.
బ్రెజిల్ స్విమ్మింగ్ టీమ్ హెడ్ ఒట్సుకా మాట్లాడుతూ.."మేం సెలవు కోసం ఇక్కడికి రాలేదు. బ్రెజిల్‌లోని 200 మిలియన్ల పన్ను చెల్లింపుదారుల తరపున ఆడేందుకు ఇక్కడకు వచ్చాం. కచ్చితంగా అంతా రూల్స్ పాటించాలి. లేదంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవు" అంటూ హెచ్చరించాడు.