Asia Cup 2023: నేటి నుంచి ఆసియా కప్ ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో పాకిస్థాన్‌ ఢీ

Asia Cup 2023: సెప్టెంబర్‌ 2న భారత్‌-పాక్‌ హైవోల్టెజ్‌ మ్యాచ్

Update: 2023-08-30 04:05 GMT

Asia Cup 2023: నేటి నుంచి ఆసియా కప్ ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో పాకిస్థాన్‌ ఢీ

Asia Cup 2023: ఇండియా–పాకిస్తాన్‌‌‌‌ మధ్య అంటేనే క్రికెట్‌ అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. ఇప్పుడు ఈ హైకోల్టేజ్‌ మ్యాచ్‌లకు ఆసియా కప్‌ వేదిక కానుంది. ఇప్పుడు రెండు వారాల్లో మూడు సార్లు ఇండో–పాక్‌‌‌‌ వార్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ను అలరించనుంది. వన్డే వరల్డ్ కప్‌కు మినీ వరల్డ్ కప్‌గా భావిస్తున్న ఆసియా కప్ 2023కి నేటి నుంచి తెరలేవనుంది. ఇవాళ్టి నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ముల్తాన్‌లో జరిగే ఆరంభ మ్యాచ్‌‌‌‌లో పాకిస్థాన్-నేపాల్ జట్లు తలపడనున్నాయి. నెల రోజుల్లో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌కు తమ జట్లను సిద్ధం చేసుకునేందుకు ఆసియా దేశాలు ఈ టోర్నీని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాయి.

ఇప్పటి వరకు జరిగిన ఆసియా కప్‌లో భారత్‌ అత్యధికంగా ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ఈసారి భారత్‌ హాట్‌ ఫేవరేట్‌ హోదాలో బరిలోకి దిగుతోంది. గతేడాది టీ20 ఫార్మాట్‌‌‌‌లో యూఏఈలో జరిగిన టోర్నీలో పాక్‌‌‌‌, శ్రీలంక చేతిలో ఓడి గ్రూప్‌‌‌‌ దశలోనే వైదొలిగిన టీమిండియా ఈసారి కచ్చితంగా టైటిల్‌‌‌‌ నెగ్గాలని ఆశిస్తోంది. గత ఓటములకు పాక్‌‌‌‌, లంకపై ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. కప్పు కంటే ముఖ్యంగా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌నకు ఇండియా టీమ్‌‌‌‌ను రెడీ చేసుకోవాలని కోచ్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ కోరుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్న కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ పూర్తి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌‌‌‌లకు దూరంగా ఉంటున్నాడు. ప్రాక్టీస్‌‌‌‌లో అతని బ్యాటింగ్‌‌‌‌ బాగానే ఉన్నప్పటికీ మరో చిన్న దెబ్బ తగలడంతో వికెట్‌‌‌‌ కీపింగ్‌‌‌‌కు తను పూర్తి సిద్ధంగా కనిపించడం లేదు. రాహుల్‌‌‌‌ మాదిరిగా సర్జరీ నుంచి కోలుకున్న మిడిలార్డర్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ సెప్టెంబర్‌‌‌‌ 2న పాకిస్తాన్‌‌‌‌తో పోరులో బరిలోకి దిగే చాన్సుంది. అలాగే, గాయాల నుంచి కోలుకొని ఐర్లాండ్‌‌‌‌తో టీ20లో రీఎంట్రీ ఇచ్చిన పేసర్లు బుమ్రా, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ వన్డేలో ఎలా ఆడతారనే దానిపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మెగా టోర్నీలో మెయిన్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఇండియానే అయినప్పటికీ డిఫెండింగ్‌‌‌‌ ఛాంపియన్‌‌‌‌ శ్రీలంక, పాక్​తో పాటు అఫ్గాన్‌‌‌‌, బంగ్లా కూడా సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఆతిథ్య జట్టే అయినప్పటికీ పాక్‌‌‌‌లో కేవలం ఆరు మ్యాచ్‌‌‌‌లే జరుగుతున్నాయి. ఎక్కువ మ్యాచ్‌‌‌‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న లంక సొంత గడ్డపై ట్రోఫీ నిలబెట్టుకోవాలని కసిగా ఉంది. అయితే, కీలక ఆటగాళ్లు దుష్మంత చమీర, హసరంగ, లాహిరు కుమార, మధుషంక గాయాలతో పూర్తి జట్టును బరిలోకి దింపేందుకు లంక ఇబ్బంది పడుతోంది. బంగ్లా పరిస్థితి కూడా ఇలానే ఉంది. తమీమ్‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌, ఎబాదట్‌‌‌‌ గాయాల వల్ల టోర్నీ నుంచి వైదొలిగారు. అన్నింటిలో పాకిస్తాన్‌‌‌‌ టీమ్‌‌‌‌ బలంగా కనిపిస్తోంది. ఇటీవలే మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో అఫ్గాన్‌‌‌‌ను వైట్​వాష్​ చేసిన బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ కెప్టెన్సీలో వన్డేల్లో టాప్​ర్యాంక్‌‌‌‌ అందుకొని జోష్‌‌‌‌లో ఉంది. వన్డే సిరీస్‌‌‌‌లో ఓటమికి పాక్‌‌‌‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అఫ్గాన్ ఆశిస్తోంది.

ఈ టోర్నీలో ఇండియా, పాక్‌‌‌‌, నేపాల్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–ఏలో.. లంక, అఫ్గాన్‌‌‌‌, బంగ్లా గ్రూప్‌‌‌‌–బిలో ఉన్నాయి. గ్రూప్‌‌‌‌లో ఒక్కో జట్టు మిగతా రెండింటితో పోటీ పడుతాయి.. రెండు గ్రూప్‌‌‌‌ల్లో టాప్‌‌‌‌2జట్లు సూపర్‌‌‌‌4కు క్వాలిఫై అవుతాయి. సూపర్‌‌‌‌4లో ప్రతీ టీమ్‌‌‌‌ మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్‌‌‌‌ ఆడుతుంది. టాప్‌‌‌‌2 టీమ్స్‌‌‌‌ సెప్టెంబర్‌‌‌‌ 17న కొలంబోలో ఫైనల్లో తలపడతాయి. గ్రూప్​లో సెప్టెంబర్​2, సూపర్​4లో 10న ఇండియా–పాక్​తలపడతాయి.ఫైనల్​ చేరితో మూడోసారి ఢీకొడతాయి.

ఆసియా కప్‌లో మొత్తంగా 13 మ్యాచులు జరగనున్నాయి. ఈ సారి హైబ్రీడ్ మోడల్‌లో టోర్నీ జరగనుంది. మొత్తం మ్యాచుల్లో పాకిస్థాన్‌లో 4 మ్యాచులు, మిగతా 9 శ్రీలంక వేదికగా నిర్వహించనున్నారు. పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్‌లు వారి సొంతగడ్డపై, భారత్ ఆడబోయే మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్‌లోనే నిర్వహించాల్సింది. అయితే అక్కడ పర్యటించేందుకు భారత్ ఒప్పుకోకపోవడంతో హైబ్రీడ్ మోడల్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి తొలుత అంగీకరించని పాక్.. చివరకు అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఒప్పుకుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో శ్రీలంక జట్టు బరిలోకి దిగనుంది. క్రితం సారి జరిగిన టోర్నీలో ఆ జట్టు పాకిస్థాన్‌ను ఫైనల్‌లో ఓడించింది. భారత జట్టు ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. అయితే ఈ సారి మాత్రం పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతున్న భారత్.. ఎలాగైనా కప్పు గెలిచి.. వన్డే వరల్డ్ కప్ నాటికి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలని భావిస్తోంది.

Tags:    

Similar News