Paralympics 2024: పారాలింపిక్స్‌లో మరో స్వర్ణం.. భారత అథ్లెట్‌ నవదీప్‌ అరుదైన ఘనత

Paralympics 2024: జావెలిన్ త్రో ఎఫ్-41‌లో భారత్‌కు గోల్డ్ మెడల్

Update: 2024-09-08 05:30 GMT

Paralympics 2024: పారాలింపిక్స్‌లో మరో స్వర్ణం.. భారత అథ్లెట్‌ నవదీప్‌ అరుదైన ఘనత

Paralympics 2024: పారిస్ పారా ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. జావెలిన్ త్రో ఎఫ్-41‌లో అనూహ్యంగా గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలో చేరింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41లో నవదీప్ స్వర్ణం దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో ఎఫ్-41‌లో ముందు ఇరాన్ అథ్లెట్ స్వర్ణం దక్కించుకోగా..భారత అథ్లెట్ నవదీప్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్ పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్-41 లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు.

Tags:    

Similar News