Novak Djokovic: పురుషుల సింగిల్స్ విభాగంలో 17వసారి జొకోవిచ్ రికార్డు..
Novak Djokovic: యువాన్ పాబ్లో వారిలాస్ పై గెలుపు
Novak Djokovic: కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ రికార్డు సృష్టిస్తూ 17వసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో రాఫెల్ నాదల్ అత్యధికంగా 16 సార్లు క్వార్టర్ ఫైనల్ చేరగా... నాదల్‌తో సమంగా ఉన్న జొకోవిచ్ తాజా విజయంతో ఈ స్పెయిన్ దిగ్గజాన్ని దాటి ముందుకు వెళ్లాడు.ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో యువాన్ పాబ్లో వారిలాస్ పై గెలుపొందాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏడు ఏస్‌లు సంధించాడు.
ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన అతను నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రికార్డు ఫెడరర్ పేరిట ఉంది.జొకోవిచ్ రెండో స్థానంలో, నాదల్ మూడో స్థానంలో, జిమ్మీ కానర్స్ నాలుగో స్థానంలో, రాయ్ ఎమర్సన్ ఐదో స్థానంలో ఉన్నారు.