ఇంగ్లాండ్ పై కివీస్ ఘన విజయం; టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్
ENG vs NZ: ఇంగ్లాండ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-0 తో కైవసం చేసుకుంది.
ENG vs NZ: ఇంగ్లాండ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-0 తో కైవసం చేసుకుంది. 21 ఏళ్ల తరువాత ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ విజయం సాధించింది. కాగా, మొదటి టెస్టులో వర్షంతో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లాండ్ టీం.. రెండో టెస్టులో మాత్రం తప్పించుకోలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. తొలి ఇన్నింగ్స్‌లో రోరీ బర్న్స్(81), లారెన్స్(81 నాటౌట్) రాణించడంతో 303 పరగులు స్కోర్ చేయగలిగింది. బౌల్ట్‌కు 4, హెన్రీ 3, అజాజ్ పటేల్ 2, వాగ్నర్ ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కాన్వే(80), యంగ్(82), రాస్ టేలర్(80) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు 4 వికెట్లు దక్కాయి.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ పేసర్లు కోలుకోనివ్వకుండా చేశారు. మ్యాట్ హెన్రీ(3/36), వాగ్నర్ (3/18), బౌల్ట్ (2/34) ధాటికి కేవలం 122కే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్(29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ గెలుపునకు 38 పరగులు మాత్రమే అవసరమైంది. ఈ లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇంగ్లండ బౌలర్లు బ్రాడ్, స్టోన్‌కు తలో వికెట్ దక్కగా, ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు మ్యాట్ హెన్రీకి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు డెవాన్ కాన్వే, ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్‌కు సంయుక్తంగా దక్కించుకున్నారు.