WPL విజేతగా ముంబై ఇండియన్స్
* ఫైనల్లో ఢిల్లీపై సత్తా చాటిన ముంబై ప్లేయర్స్
WPL: వుమన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీతో తలపడిన ముంబై అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 131 పరుగులు చేసింది. 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన ముంబై ఇండియన్స్ ప్రాంరంభంలో తడబడినప్పటికీ... నట్ సివెర్ బ్రంట్ అద్భుతమైన ఆట తీరుతో ఆటను మలుపు తిప్పింది. జట్టును విజయానికి చేరువచేసింది. తొలిసారిగా నిర్వహించిన వుమన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ముంబై జట్టు ముద్దాడింది.