MS Dhoni does Organic Farming : అయ్యో ధోనీకి ఏమైంది..? అభిమానుల్లో ఆందోళన
MS Dhoni does Organic Farming : టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి ఏమైంది? ధోని న్యూ లుక్ చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
MS Dhoni does Organic Farming: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి ఏమైంది? ధోని న్యూ లుక్ చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెరిసిన గడ్డంతో ధోని కనిపించడంతో కారణం ఏంటి..? సామాజిక మాధ్యమాల్లో ధోనీ లుక్‌పై ఇప్పుడు సరికొత్త చర్చ జరుగుతోంది. .
హెయిర్ స్టయిల్ కోసమే ప్రత్యేకంగా ఒకరిని (స్వప్న భవనాని) నియమించుకున్న స్థాయి ధోనీది..
మార్చి నుంచి లాక్‌డౌన్ కారణంగా రాంచీ లోని ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ధోనీ.. రాంచీలోని ఫామ్‌హౌస్‌లో ప్రస్తుతం ఉంటూ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్న ధోనీ.. ఫామ్‌హౌస్‌లోనే ఉన్నప్పటికీ అతని అప్‌డేట్స్ మాత్రం ఎప్పటికప్పుడు అతని భార్య సాక్షి, స్నేహితులుకు అభిమానులకి తెలియజేస్తున్నారు. కూతురు జీవాతో కలిసి బైక్‌పై ధోనీ ఇటీవల చక్కర్లు కొడుతున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
జులై 7న 39వపుట్టినరోజు కావడంతో #DhoniBirthdayCDP హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌గా మారిపోయింది. అయితే, పుట్టినరోజు నాటికైనా ధోనీ తన లుక్‌ని మార్చాలని అభిమానులు కోరుతున్నారు.
కాగా.. ధోని ఫాంహౌస్ లోనే సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తున్నాడు. ఈ మేరకు స్వయంగా ట్రాక్టర్‌తో నేలని చదును చేస్తూ.. విత్తనాల్ని వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ లోక్ చూడగానే అభిమానులు కంగారు పడ్డారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని లూక్ మార్చాలని కొందరు కోరుతున్నారు.. మరింకొందరి ఈ న్యూ లూల్ కంటిన్యూ చేయని సూచిస్తున్నారు.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరమైన ధోనీ.. ఆ తర్వాత కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఏడాది క్రికెట్ మ్యాచులు జరిగితే ధోని పునరాగమనంపై అభిమానులు ఆశగా ఎదురచూస్తున్నారు. ఈ ఏడాది iplలో అడాలని ధోని నిర్ణయించుకున్నాడు. కరోనా వ్యాప్తి కారణంగా అది వాయిదా పడింది.