బీసీసీఐ టూర్లలో షమీ కాల్ గర్ల్స్ తో గడిపేవాడు.. సుప్రీం కోర్టులో షమీ భార్య సంచలన ఆరోపణలు
Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీకి కష్టాలు మరింత పెరిగేలా ఉన్నాయి.
Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీకి కష్టాలు మరింత పెరిగేలా ఉన్నాయి. భార్య హసిన్ జహాన్ తో మొహమ్మద్ షమీకి కొనసాగుతున్న వివాదం తాజాగా కొత్త మలుపు తీసుకుంది. షమీని అరెస్ట్ చేయాలంటూ హసిన్ జహాన్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. షమీపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పై సెషన్స్ కోర్టు స్టేను సమర్థిస్తూ కలకత్తా హై కోర్టు జారీ చేసిన ఆదేశాలను హసిన్ సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..షమీ 2014లో హసిన్ జహాన్ ను వివాహం ఆడాడు. వీరికి ఒక పాప. వీరి కాపురం కొంత కాలం సజావుగా సాగగా..2019లో కాపురంలో కలతలు బయటపడ్డాయి. షమీ తనను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ అతనిపై హసిన్ గృహ హింస కింద కేసు పెట్టింది. దీంతో అతని పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ వారెంట్ పై సెషన్స్ కోర్టు స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ షమీ భార్య కలకత్తా హై కోర్టును ఆశ్రయించింది.
మూడేళ్లుగా నడిచిన ఈ కేసుపై కలకత్తా హై కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. షమీ నెలకు రూ.1.30 లక్షలు భరణం ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో రూ.80 వేలు పిల్లల సంరక్షణ కోసం కాగా రూ.50 వేలు భార్య కోసమని స్పష్టం చేసింది. అయితే దీనిపై అసంతృప్తిగా ఉంది. తనకు భరణం కింద నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలని అందులో రూ.7లక్షలు తన ఖర్చుల నిమిత్తం కాగా మరో రూ.3 లక్షలు కుమార్తె కోసమని కేసు సందర్భంగా పిటిషన్ లో పేర్కొంది. అయితే భరణం విషయంలో కలకత్తా హై కోర్టు తీర్పుపై హసిన్ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలోనే షమీ భార్య హసిన్ జహాన్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
కట్నం విషయంలో షమీ తనను తీవ్రంగా వేధించాడని, టీమిండియా టూర్లకు వెళ్లినప్పుడు కూడా చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. షమీని అరెస్ట్ చేయకుండా స్టే విధించారని, దాన్ని ఎత్తివేయాలంటూ సుప్రీం కోర్టును అభ్యర్థించింది. తాజాగా వీరి వివాదం సుప్రీం కోర్టుకు చేరడంతో ఎక్కడకు దారి తీస్తుందోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో షమీ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్ లో 17 వికెట్లు తీసి పర్పుప్ క్యాప్ అందుకున్నాడు. హసిన్ తాజా ఆరోపణలతో షమీ పై బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుందో..అతడిపై ఈ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.