కంగారూలతో టీ20 ఫైట్‌కు రెడీ అయిన టీమిండియా

Update: 2020-12-04 05:21 GMT

సిరీస్ చేజారినా.. చివరి వన్డేలో విజయం తర్వాత టీమిండియాలో ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే జోష్‌లో టీ20 సిరీస్‌కు రెడీ అవుతోంది. ఇంతకీ టీమిండియాను వెంటాడుతోన్న బలహీనతలు ఏంటి.

ఉత్కంఠభరితంగా సాగిన వన్డే సిరీస్ తర్వాత భారత్, ఆస్ట్రేలియా మరో కీలక పోరు కోసం రెడీ అవుతున్నాయ్. శుక్రవారం నుంచి కాన్ బెర్రాలోని మనుకా ఓవల్‌ వేదికగా మూడు మ్యాచ్‌ల ట్వంటీ 20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా టీం, విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా టీ 20 సిరీస్‌పై కన్నేశాయి. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో ఆసీస్ ఎగరేసుకపోగా కనీసం టీ20 ఫార్మటైనా గెలిచి ఆస్ట్రేలియాకు ధీటైనా సమాధానం ఇవ్వాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.

బుధవారం మనుకా ఓవల్‌లో వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాను 13పరుగుల తేడాతో భారత్ ఓడించింది. అదే స్పూర్తిని టీ20లోనూ కోనసాగించాలని టీమిండియా అనుకుంటుంది. సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో వరుసగా 66 పరుగులు, 51 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. కాన్‌బెర్రా వాతావరణం ఓసారి.. ఎండలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 28-డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 12-డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావచ్చు. పిచ్ విషయానికి వస్తే సమతుల్యతతో ఉంటుందని ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు.

బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు కూడా కాన్ బెర్రా వేదికగా ప్రయోజనంగా ఉంటుంది. పిచ్ పేసర్లకు అనుకూలిస్తోంది. బౌన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. టీమిండియా బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్‌లు లాంటి పేసర్లకు వికెట్స్ ఎక్కువగా సాధించవచ్చు. వన్డే సిరీస్ లో ఎదురైన పరాభవాన్ని గట్టిగా బదులు తీర్చుకోవాలని టీమిండియా కసితో ఉంది. సిరీస్ ఎగురేసుకుపోవాలని కష్టపడుతోంది. 

Tags:    

Similar News