Mary Kom: స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కీలక ప్రకటన
Mary Kom: స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగారు.
Mary Kom: స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, తనకు మరో అవకాశం లేదని మేరీ కోమ్ వెల్లడించారు. భారత దేశానికి సాధ్యమైనంతవరకు సేవ చేయడం గౌరవంగా భావిస్తానని..అందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రతిష్ఠాత్మక బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నట్లు తెలిపారామె.
పారిస్ ఒలింపిక్స్‌లో మేరీ కోమ్‌ను చెఫ్ డి మిషన్‌గా నియమిస్తూ మార్చి 21న భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే భారత బృందానికి ఆమె లాజిస్టికల్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ బాధ్యతల నుంచి ఆమె వైదొలిగడం చర్చనీయాంశంగా మారింది.