IPL 2021: ఐపీఎల్ నిర్వహిస్తామంటూ పోటీ పడుతున్న దేశాలు

ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తామంటూ పలు దేశాల క్రికెట్ బోర్డులు పోటీ పడుతున్నాయి.

Update: 2021-05-10 17:15 GMT

ఐపీఎల్ ట్రోఫీ (ఫొటో ట్విట్టర్)

IPL 2021: ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ సీజన్‌ను నిర్వహిస్తామంటూ పలు దేశాల క్రికెట్ బోర్డులు పోటీ పడుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో దాదాపు 29 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలిపోయాయి. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడం కష్టమని తేల్చేశాడు. దీంతో పలు దేశాలు ఐపీఎల్ నిర్వహణపై ఆసక్తి చూపుతున్నాయి. భారత్‌లో కరోనా కేసలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఇండియాలో అక్టోబర్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌ పై కూడా సందిగ్ధం నెలకొంది.

కాగా, యూఏఈ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక దేశాల బోర్డులు ఐపీఎల్ నిర్వహిస్తామంటూ ముందుకొచ్చాయి. టీ20 ప్రపంచకప్‌ను యూఏఈ కి తరలిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఐపీఎల్‌ టోర్నీ కూడా యూఏఈ లోనే జరిగే అవకాశం ఉందని టాక్ వినిపించింది. కారణం, గతేడాది ఐపీఎల్ సీజన్‌ను యూఈఏలో సక్సస్‌ఫుల్ గా నిర్వహించారు.

ఇక ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత ఐపీఎల్, టీ20 వరల్డ్‌కప్ కోసం టీమ్‌ఇండియా యూఏఈ చేరుకునేలా ప్రయత్నాలు చేయాలి. యూఏఈతో పోలిస్తే ఇంగ్లాండ్‌లో ఐపీఎల్ లీగ్‌ నిర్వహించేందుకు అధికంగా ఖర్చు అవుతుంది. కాబట్టి యూఏఈ ని ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఇక ఆస్ట్రేలియా, శ్రీలంక లు ఐపీఎల్ నిర్వహణకు ముందుకొచ్చినా.. బీసీసీఐ మాత్రం యూఏఈ, ఇంగ్లాండ్ లో నిర్వహించేందుకు మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ నిర్వహణకు ఆయా దేశాలు ముందుకు రావడానికి కారణం డబ్బేనని తెలుస్తోంది. గతేడాది యూఏఈకు బీసీసీఐ రూ.98.5 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న క్రికెట్‌ బోర్డులకు ఈ ఆదాయం కలిసొచ్చేదే. దీంతో పాటు ఇతర మార్గాల్లోనూ ఆదాయం వస్తుంది. కాగా, టీ20 ప్రపంచకప్‌కు యూఏఈ బెస్ట్‌ అని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News