IPL 2023: ఐపీఎల్ 2023 ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్టు.. బద్దలైన రికార్డులు ఏంటంటే..!

Highest Score in IPL: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రభావమో ఏమో ఐపీఎల్ 16వ సీజన్ లో బ్యాట్స్ మెన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.

Update: 2023-04-29 08:55 GMT

IPL 2023: ఐపీఎల్ 2023 ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్టు.. బద్దలైన రికార్డులు ఏంటంటే..!

Highest Score in IPL: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రభావమో ఏమో ఐపీఎల్ 16వ సీజన్ లో బ్యాట్స్ మెన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. బౌండర్లీలు, సిక్సర్లతో హోరెత్తించేస్తూ క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను రుచి చూపిస్తున్నారు. సీజన్ సగంలో ఉండగానే ఇప్పటికే 18 సార్లు 200కుపైగా స్కోర్లు నమోదు కావడం విశేషం. ఇప్పటివరకు 8.84 స్కోరింగ్ రేట్ తో పరుగులు వచ్చాయి. 2018లో 8.65 స్కోరింగ్ రేట్ నమోదు అయింది. ఇది ఐపీఎల్ హిస్టరీలో రికార్డు కాగా ఆ రికార్డును 2023 సీజన్ బద్దలు కొట్టడం ఖాయంగా ఉంది.

పంజాబ్-లఖ్ నవూ మధ్య జరిగిన మ్యాచ్ లో అరుదైన రికార్డులు నమోదు అయ్యాయి. లఖ్ నవూ సాధించిన 257 పరుగులు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు. లఖ్ నవూ చేతిలో పంజాబ్ ఓటమి పాలైనా ఆ జట్టు 201 పరుగులు చేయడంతో మరో రికార్డ్ నమోదు అయింది. లఖ్ నవూ, పంజాబ్ రెండు టీములు కలిపి చేసిన పరుగులు 458. ఇది ఒక రికార్డు. గతంలో సీఎస్ కే – ఆర్ ఆర్ టీమ్లు కలిపి 469 పరుగులు సాధించి తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ కింగ్స్-కేకేఆర్ టీమ్లు ఉన్నాయి. ఈ రెండు టీమ్లు కలిపి 459 పరుగులను నమోదు చేశాయి.

పంజాబ్_ లఖ్ నవూ మ్యాచ్ కు మరో రికార్డు కూడా దక్కింది. అత్యధిక బౌండర్లీలు నమోదైన పోరుగా ఈ మ్యాచ్ నిలిచింది. మ్యాచ్ లో మొత్తం 67 బౌండర్లీలు నమోదు అయ్యాయి. వీటిలో 45 ఫోర్లు ఉంటే 22 సిక్స్ లు ఉన్నాయి. గతంలో అంటే 2010లో సీఎస్ –ఆర్ ఆర్ మ్యాచ్ లో 69 బౌండర్లీలు పడ్డాయి. ఇందులో 39 ఫోర్లు, 30 సిక్స్ లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తర్వాతి స్థానంతో తాజాగా జరిగిన పంజాబ్ – లఖ్ నవూ మ్యాచ్ నిలిచింది. ఇక పంజాబ్_ లఖ్ నవూ మ్యాచ్ లో 16 మంది బౌలింగ్ చేశారు. ఇది కూడా ఒక రికార్డే

ఈ సీజన్ లో మరో అరుదైన రికార్డ్ కూడా నమోదు అయింది. రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ అశ్విన్ పేరిట ఈ రికార్డు క్రియేట్ అయింది. ఐపీఎల్ లో 20 మంది బ్యాట్స్ మెన్ ను డకౌట్ చేసిన బౌలర్ గా అశ్విన్ రికార్డులకెక్కాడు. సీఎస్ కే తో జరిగిన మ్యాచ్ లో అంబటి రాయుడుని డకౌట్ చేసి అశ్విన్ ఈ ఘనత అందుకున్నాడు. అశ్వినే తొట్ట తొలి బౌలర్.

Tags:    

Similar News