Lionel Messi: ఇండియన్ మార్కెట్లో ఫుట్ బాల్ స్టార్ మెస్సీ బీడికట్ట..!!

Update: 2021-08-01 07:29 GMT

బీడికట్టపై మెస్సి (ట్విట్టర్ ఫోటో)

Lionel Messi: దక్షిణ అమెరికాలో ఇటీవల జరిగిన కోపా అమెరికా టోర్నీ ఫైనల్ లో బ్రెజిల్ తో తలపడిన ఆర్జెంటినా టీం ఆ మ్యాచ్ గెలుపుతో 28 ఏళ్ళ నిరీక్షణకు ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి సారధ్యంలో తెరదించారు. బ్రెజిల్-ఆర్జెంటినాతో తన 151 వ మ్యాచ్ ఆడిన మెస్సి తన కెరీర్లో ఆర్జెంటినా తరపున ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇక కోపా టోర్నీలో తన అద్భుత ప్రదర్శన కనబరిచిన మెస్సి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కంపెనీలు తన ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు కోట్లల్లో చెల్లించడానికి వరల్డ్ మార్కెట్ లో పోటీ పడుతుంటారు. అయితే తాజాగా మెస్సి బీరి అంటూ మెస్సి ఉన్న ఫోటోతో ఒక బీడి కంపెనీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత్ లోని ఒక బీడి కంపెనీ మెస్సి పేరుతో పాటు అతని ఫోటోని ప్యాకింగ్ కవర్ పై ప్రింట్ చేసి అమ్మకాలు మొదలుపెట్టారు. ఆ నోట ఈ నోట వచ్చిన ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో చూసిన పలువురు అమెరికా కోపా టోర్నీ గెలిచాక మెస్సి ఈ బీడి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడని కొందరు సరదాగా కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది భారత్ లో బీడి కంపెనీ కోసం చేసుకున్న వాణిజ్య ఒప్పందం అంటూ సరదాగా ట్రోల్ చేస్తూ ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News