Rajiv Gandhi Khel Ratna: ఖేల్ రత్న బరిలో కోనేరు హంపి

Rajiv Gandhi Khel Ratna: భారత అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్‌ ఖేల్‌రత్న' అవార్డు కు ఐఏసీఎఫ్ సిఫారస్సు చేసింది.

Update: 2021-07-02 05:25 GMT

Koneru Humpy:(File Image)

Rajiv Gandhi Khel Ratna: భారత అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్‌ ఖేల్‌రత్న' అవార్డు కోసం భారత స్టార్‌ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పేరును ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (AICF) ప్రతిపాదించింది. అలాగే, మరో ఏడుగురు చెస్ ప్లేయర్లను అర్జున అవార్డుకు నామినేట్ చేసింది. వచ్చే ఏడాది జరిగే మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించిన ప్రపంచ మూడో ర్యాంకర్ హంపి..2020 ఆన్ లైన్ చెస్ ఒలింపియాడ్ టైటిల్ గెలిచిన భారత్ జట్టులో సభ్యురాలు కూడా. అలాగే మరో ఏడుగురు ప్లేయర్లను అర్జున అవార్డు కోసం నామినేట్ చేసినట్లు తెలిపింది.

చెస్ లో అంతర్జాతీయంగా రాణించి, అతిచిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ గా నిలిచింది. 2002 వసంవత్సరంలో కేవలం 15 ఏళ్ల కే గ్రాండ్ మాస్టర్ గా నిలిచి ఫేమస్ అయింది. దీంతో చదరంగం ఆటను జనాల్లోకి తీసుకెళ్లిన ఘనత హంపికే దక్కనుంది. మధ్యలో ఆటకు కొంత గ్యాప్ ఇచ్చింది. తరువాత 2019లో బరిలో నిలిచి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచింది.

2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్‌ కాంస్య పతకం సాధించాడు. కిదాంబి శ్రీకాంత్‌ 2017లో 4 సూపర్‌ సిరీస్‌ టైటిళ్లను గెలుచుకున్నాడు. ప్రణవ్‌ చోప్రా, ప్రణయ్, సమీర్‌వర్మల పేర్లను అర్జున అవార్డుల కోసం నామినేట్ చేసింది. వీరితో పాటు కోచ్‌లు మురళీధరన్‌, భాస్కర్‌బాబు లను దోణాచార్య అవార్డుకు నామినేట్ చేసింది. అలాగే లెరోయ్‌ డిసా, పీవీవీ లక్ష్మిలను ధ్యాన్‌చంద్‌ పురస్కారాలకు ప్రతిపాదించింది. మరోవైపు గ్రాండ్‌మాస్టర్‌ లలిత్‌బాబు, భక్తి కులకర్ణి, విదిత్‌ గుజరాతీ, సేతురామన్, పద్మిని రౌత్‌, అధిబన్ ల పేర్లను ఏఐసీఎఫ్‌ అర్జున అవార్డులకు నామినేట్ చేసింది.

Tags:    

Similar News