ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023పై కీలక అప్‌డేట్.. టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే?
ODI World Cup 2023 Schedule: వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌కు సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య ఈ టోర్నీ భారత్‌లో జరగనుంది. బీసీసీఐ ఇటీవలే ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి అందజేసింది.
ICC ODI World Cup 2023 Schedule: వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌కు సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య ఈ టోర్నీ భారత్‌లో జరగనుంది. బీసీసీఐ ఇటీవలే ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి అందజేసింది. కానీ, అధికారిక షెడ్యూల్ (ODI World Cup 2023 Schedule) ఇంకా ప్రకటించలేదు. ఈ షెడ్యూల్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రపంచ కప్ 2023పై కీలక అప్‌డేట్
మీడియా నివేదికల ప్రకారం, ODI ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ను ఈ వారంలో ప్రకటించవచ్చని తెలుస్తోంది. సభ్య దేశాలన్నీ అంగీకరించినప్పుడే ముసాయిదా షెడ్యూల్ తుది రూపంలోకి వస్తుంది. అయితే కొన్ని మ్యాచ్‌ల వేదికపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసంతృప్తిగా ఉంది. దీంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతోంది. సమాచారం ప్రకారం, టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ నవంబర్ 19 న జరుగుతుంది.
టోర్నమెంట్ డ్రాఫ్ట్ షెడ్యూల్..
నివేదికల ప్రకారం, ODI ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. నవంబర్ 19న ఈ మైదానంలో ఫైనల్ కూడా జరగనుంది. టీమ్ ఇండియా తన 9 మ్యాచ్‌లను 9 వేర్వేరు వేదికల్లో ఆడనుంది. అదే సమయంలో అక్టోబర్ 15న భారత్, పాకిస్థాన్ (IND vs PAK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనుంది. మరోవైపు పాకిస్థాన్ 5 వేదికల్లో మ్యాచ్‌లు ఆడనుంది.
టీమ్ ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్ ఎలా ఉందంటే-
అక్టోబర్ 8 చెన్నై- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
అక్టోబర్ 11 ఢిల్లీ -ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
అక్టోబర్ 15 అహ్మదాబాద్ -ఇండియా వర్సెస్ పాకిస్థాన్
అక్టోబర్ 19 పూణె -ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్
అక్టోబర్ 22 ధర్మశాల -ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
అక్టోబర్ 29 లక్నో -ఇండియా వర్సెస్ ఇంగ్లండ్
నవంబర్ 2, ముంబై -ఇండియా వర్సెస్ క్వాలిఫయర్,
నవంబర్ 5, కోల్‌కతా- ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా,
నవంబర్ 11, బెంగళూరు -ఇండియా v క్వాలిఫైయర్.