IPL: అమెజాన్ అవుట్.. అంబానీదే ఐపీఎల్..
IPL Media Rights: ప్రపంచ కుబేరులు జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ మధ్య పోటీగా వ్యాపార వర్గాలు భావించిన ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్లలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
IPL Media Rights: ప్రపంచ కుబేరులు జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ మధ్య పోటీగా వ్యాపార వర్గాలు భావించిన ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్లలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ రేసు నుంచి జెఫ్‌కు చెందిన అమెజాన్ సంస్థ వైదొలిగింది. ఐపీఎల్ మీడియా హక్కుల బిడ్డింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానున్న తరుణంలో అమెజాన్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఐపీఎల్ టీవీ, డిజిటల్ హక్కుల రేసులో రియలన్స్‌కు చెందిన వయాకామ్ 18 సంస్థ అతిపెద్ద పోటీదారుగా అవతారం ఎత్తింది.
అయితే వయాకామ్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన అమెజాన్ చివరి నిమిషంలో ఎందుకు తప్పుకుందన్నది తెలియరాలేదు. దీనిపై బీసీసీఐ అధికారి స్పందిస్తూ అమెజాన్ సంస్థ పోటీ నుంచి తప్పుకుందని ప్రకటించారు. టెక్నికల్ బిడ్డింగ్ ప్రక్రియలో అమెజాన్ ప్రతినిధులు పాల్గొనలేదు. ఇక గూగుల్, కూడా దీనిపై ఆసక్తి చూపుతూ బిడ్ డాక్యుమెంట్ తీసుకున్నా ఆ తర్వాత తిరిగి సమర్పించలేదు. ఐపీఎల్‌లో వచ్చే పదేళ్ల కాలానికి అంటే 2023 నుంచి 2027 వరకు టెలివిజన్, డిజిటల్ కంటెంట్ ప్రసార హక్కుల కోసం బీసీసీఐ ఈ బిడ్డింగ్ నిర్వహిస్తోంది.