ఇషాంత్ శర్మ @300 వికెట్లు

Update: 2021-02-08 09:10 GMT

ఇషాంత్ శర్మ రికార్డు 

చెన్నై టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు పుంజుకున్నారు. టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ డానియెల్ లారెన్స్ ను అవుట్ చేయడం ద్వారా ఇషాంత్ 300 వికెట్ల క్లబ్ లోకి చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఫీట్ ఇంతకు ముందు ఇద్దరు ఫేస్ బౌలర్లు మాత్రమె సాధించారు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తరువాత మూడొందల వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్ గా ఇషాంత్ ఇప్పుడు చరిత్ర సృష్టించాడు. ఇషాంత్ ఈ ఫీట్ ను 98 టెస్ట్ మ్యాచ్ లలో సాధించాడు.

ఇదిలా ఉంటె, ఇంగ్లండ్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోయింది. టీమిండియాకు ఫాలో ఆన్ ఇవ్వకుండా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్ తోలి బంతికే అశ్విన్ బౌలింగ్లో మొదటి వికెట్ కోల్పోయింది. తరువాత కూడా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ప్రస్తుతం 79 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్ టీం. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే పనిలో పడ్డాడు. 18 పరుగులకే 27 పరుగులు చేసిన రూట్ తో పాటు ఒలి పాప్ క్రీజులో ఉన్నాడు.


Tags:    

Similar News