IPL2023 PlayOffs: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏయే టీమ్ కి ఎలా ఉన్నాయంటే..?
* ఐపీఎల్ 16 సీజన్ లీగ్ దశ పోరు చివరి అంకానికి చేరుకుంది. కేవలం 4 మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
IPL2023 PlayOffs: ఐపీఎల్ 16 సీజన్ లీగ్ దశ పోరు చివరి అంకానికి చేరుకుంది. కేవలం 4 మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్స్ కు గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే అర్హత సాధించగా హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్ పోటీ నుంచి నిష్క్రమించాయి. మిగిలిన ఆరు జట్లకు ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న అవకాశాలు ఏంటో ఒకసారి పరిశీలిస్తే..
చెన్నై సూపర్ కింగ్స్ :
పాయింట్స్ టేబుల్ లో ధోనీ టీమ్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం సీఎస్కే ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. ఇవాళ షెడ్యూల్ అయిన ఢిల్లీ మ్యాచ్ లో సీఎస్కే గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఓడినా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆఫ్స్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే అలా జరగాలంటే ముంబై, బెంగళూరు జట్లు తమ తదుపరి మ్యాచుల్లో పరాజితులు కావాలి.
లఖ్ నవూ సూపర్ జెయింట్స్ :
ఈ టీమ్ కూడా 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించేందుకు పోటీపడుతుంది. సీఎస్కేతో సరిసమానంగా 15 పాయింట్లు ఉన్నా నెట్ రన్ రేట్ ప్రకారం 3వ స్థానంలో ఉంది. శనివారం జరిగే తన ఆఖరి మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ పై గెలవాలి. అలా గెలిస్తే ఇతర జట్ల మ్యాచులతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ కు లఖ్ నవూ చేరుతుంది. ఒకవేళ కోల్ కతా చేతిలో ఓటమి చెందితే మాత్రం...ముంబై, బెంగళూరు జట్లు ఓడిపోవాలని లఖ్ నవూ టీమ్ ప్రార్థించాల్సి ఉంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఆర్సీబీ జట్టు ప్రస్తుతం 4వ ప్లేసులో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే గుజరాత్ టైటాన్స్ తో ఆడే చివరి లీగ్ లో కచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఓడితే అవకాశం ఉండవా అంటే ఉంటాయనే చెప్పాలి కాకపోతే గుజరాత్ చేతిలో 5 పరుగులు కన్నా తక్కువ రన్స్ తేడాతో ఆర్సీబీ ఓడిపోవాలి. ఇక, ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఓటమి పాలవ్వాలి. చెన్నై, లఖ్ నవూ టీమ్స్ తమ తదుపరి మ్యాచుల్లో ఓడి, ఆర్సీబీ గెలిస్తే..ఈ జట్టు ఏకంగా 2వ స్థానానికి ఎకబాకుతుంది.
ముంబై ఇండియన్స్ :
ఈ టీమ్ కు నెట్ రన్ రేట్ శాపంగా మారింది. గత చివరి మ్యాచులో లఖ్ నవూ చేతిలో ఓడి ముంబై జట్టు తన ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఆదివారం హైదరాబాద్ తో జరిగే మ్యాచులో గెలిచినా ప్లే ఆఫ్స్ కు చేరుతుందని గ్యారెంటీ లేకుండా ఉంది. ముందుగా చెప్పినట్లు నెట్ రన్ రేట్ కీలకంగా ఉంది. హైదరాబాద్ పై ముంబై గెలిచి...అదే సమయంలో ఆర్సీబీ ఓడితే మాత్రం రోహిత్ సేన ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంటుంది.
రాజస్థాన్ రాయల్స్ :
రాజస్థాన్ రాయల్స్ తన గత మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించడంతో ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. లేదంటే ఈపాటికే తన బ్యాగులు సర్దేసుకోవాల్సి ఉండేది. అయితే పంజాబ్ ను రాజస్థాన్ రాయల్స్ ఓడించినప్పటికీ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మాత్రం ఆర్సీబీ, ముంబై జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఈ రెండు జట్లు ఓడితే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఆర్సీబీ, ముంబై వీటిల్లో ఏ ఒక్క జట్టు గెలిచినా రాజస్థాన్ ప్రయాణం ఈ ఐపీఎల్ లో ముగిసినట్టే.
కోల్ కతా నైట్ రైడర్స్ :
ప్లే ఆఫ్స్ రేసులో కోల్ కతా నైట్ రైడర్స్ ఉన్నప్పటికీ..అర్హత సాధించడం మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. లఖ్ నవూ పై కోల్ కతా 103 పరుగుల భారీ తేడాతో గెలవాలి. ఇదే సమయంలో ఆర్సీబీ, ముంబై జట్లు ఓడిపోవాలి. అలా జరిగితే తప్పా కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకోలేదు..ఈ ఈక్వెషన్ అసాధ్యమనే చెప్పాలి. కాబట్టి కోల్ కతా నైట్ రైడర్స్ కథ కంచికి చేరిందనే చెప్పాలి.