IPL 2023 Leagues: హోరాహోరీగా ముగిసిన లీగ్స్.. రికార్డుల వివరాలు..

*ఐపీఎల్ 2023 తుది అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ కు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ అర్హత సాధించాయి. లీగ్ దశలో నమోదైన రికార్డులు ఏ విధంగా ఉన్నాయంటే..

Update: 2023-05-22 09:28 GMT

IPL 2023 Leagues: హోరాహోరీగా ముగిసిన లీగ్స్.. రికార్డుల వివరాలు..

IPL 2023 Leagues: ఐపీఎల్ 2023 తుది అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ కు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ అర్హత సాధించాయి. లీగ్ దశలో నమోదైన రికార్డులు ఏ విధంగా ఉన్నాయంటే..

ఐపీఎల్ 2023 లీగ్ పోరు ముగిసింది. గత సీజన్లను మరిపిస్తూ ప్రేక్షకులకు అసలుసిసలైన టీ20 మజాను అందిస్తూ లీగ్ దశ రసవత్తరంగా ముగిసింది. ఆదివారం జరిగిన మ్యాచుల్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంటిదారి పడితే సన్ రైజర్స్ ను ఓడించి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఇక ప్లే ఆఫ్స్ పోరాటానికి గుజరాత్ టైటాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ సై అంటున్నాయి.

సిక్సర్ల హోరు

లీగ్ దశ పోరు చాలా ఉత్కంఠంగా సాగింది. టీ20 పేరుకి తగ్గట్టే ఫోర్లు, సిక్సులతో ఆటగాళ్లు హోరెత్తించారు. ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక రికార్డు బద్దలు అవుతూనే ఉంది. లీగ్ దశలోనే అత్యధిక సిక్సుల రికార్డు ఈ సీజన్ బ్రేక్ చేసింది. గత సీజన్ లో 1062 సిక్సులు నమోదు కాగా ఆ రికార్డును అధిగమించేస్తూ ఇప్పటికే 1066 సిక్సులు నమోదు అయ్యాయి. అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా ఆర్సీబీ ప్లేయర్ ఫాఫ్ డూప్లెసిస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 14 మ్యాచుల్లో 36 సిక్సులు బాదాడు.

బౌండరీల బాదుడు

లీగ్ దశలో అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్ గా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి స్థానంలో నిలిచాడు. 14 ఇన్నింగ్స్ లో 82 బౌండరీలు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో 69 బౌండరీలతో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డెవన్ కాన్ వే ఖాతాలో సైతం 69 బౌండరీలు ఉన్నాయి. 4వ స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ఇతడు 67 బౌండరీలు సాధించాడు. ఇక 65 బౌండరీలతో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు.

పరుగుల వీరులు

2023 ఐపీఎల్ సీజన్ లో పరుగుల మోత మోగింది. పలువురు ఆటగాళ్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. లీగ్ దశలోని 14 ఇన్నింగ్స్ లో ఆర్సీబీ ఆటగాడు ఫాఫ్ డూప్లెసిస్ 730 పరుగులు సాధించి టాప్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఇతడి ఇన్నింగ్స్ లో 60 ఫోర్లు, 36 సిక్సులు ఉన్నాయి. టోటల్ గా ఈ లీగ్ లో 8 అర్థసెంచరీలు నమోదు చేశాడు. ఇక రెండవ స్థానంలో శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ఈ గుజరాత్ టైటాన్స్ ఆటగాడు 67 ఫోర్లు, 22 సిక్స్ లు బాది మొత్తం 680 పరుగులు సాధించాడు. శుభ్ మన్ ఇన్నింగ్స్ లో సెంచరీలు, 4 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక మూడవ స్థానంలో 639 పరుగులతో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ నిలిచాడు. మొత్తం 14 మ్యాచుల్లో 65 బౌండరీలు, 16 సిక్సులు బాదాడు. 2 సెంచరీలు, ఆరు అర్థసెంచరీలు నమోదు చేశాడు.

11 శతకాలు, 137 అర్థ సెంచరీలు

టీ 20 పేరుకు తగ్గట్టే ఈ సీజన్ లో పరుగుల మోత మోగింది. మొత్తం పది జట్లు కలిపి 24,162 పరుగులు సాధించాయి. 11 సెంచరీలు, 147 హాఫ్ సెంచరీలు నమోదు అయ్యాయి. అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ జట్టు 2592 పరుగులతో తొలి స్థానంలో నిలిచింది. 2 సెంచరీలు 14 హాఫ్ సెంచరీలు సాధించింది. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. ఈ టీమ్ మొత్తం 2556 పరుగులు సాధించింది. ఇందులో 1 సెంచరీతో పాటు 11 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక మూడవ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. బెంగళూరు జట్టు 2502 పరుగులు సాధించగా 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

వికెట్లు

ఐపీఎల్ 2023 లీగ్ లో భాగంగా 70 మ్యాచులు జరిగాయి. బ్యాటర్స్ కు ధీటుగా బౌలర్లు చెలరేగారు. మొత్తం 850 వికెట్లు పడగొట్టారు. 104 వికెట్లు పడగొట్టి గుజరాత్ టైటాన్స్ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 95 వికెట్లు తీసి ఆర్సీబీ రెండవస్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 91 వికెట్లు తీసి అత్యథిక వికెట్లు తీసిన జాబితాలో టాప్ 3 పొజిషన్ దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ అటగాడు మొహమ్మద్ సమి వ్యక్తిగతంగా 24 వికెట్లు తీసి తొలిస్థానంలో నిలవగా, జీటీకి చెందిన రషీద్ ఖాన్ సైతం 24 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహాల్ 21 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

Tags:    

Similar News