IPL 2021: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది. ఐపీఎల్ బ్యాలెన్స్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కానుంది. బీసీసీఐ ప్రకటనతో ఐపీఎల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కరోనాతో అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ తిరిగి ప్రారంభమవుతుందా లేదా అన్న సందేహాలు వీడిపోయాయి. ధనాధన్ ఎంటర్ టైన్మెంట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 15న దసరా పండగ కూడా ఉండడంతో.. ఫైనల్ రోజు అభిమానులకు డబుల్ ధమాకా ఉండనుంది.
మరోవైపు.. బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మధ్య ఇటీవల జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని.. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాల్లో మిగిలిన ఐపీఎల్ 2021 మ్యాచులను సక్సెస్ చేస్తామని బీసీసీఐ చెబుతోంది. యూఏఈలో మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహిస్తామని బీసీసీఐ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. 2021 సిరీస్‌లోని బ్యాలెన్స్ మ్యాచ్‌లు పూర్తిచేయడానికి 25 రోజుల విండో సరిపోతుందని బోర్డు భావిస్తుంది.
సిరీస్ షెడ్యూల్ అయితే వచ్చేసింది కానీ, విదేశీ ఆటగాళ్ల విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ 25రోజుల షెడ్యూల్‌లో ఎంతమంది విదేశీ స్టార్ ఆటగాళ్లు వస్తారనేది అనుమానమే. అయితే, బీసీసీఐ మాత్రం ఆటగాళ్లు, ఆయా దేశాలతో బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. అటు.. ఐపీఎల్‌లో పాల్గొనని ఆటగాళ్ల జీతంలో కోత పడే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ హెచ్చరించింది.