IPL 2021: బెంగళూరు లక్ష్యం 178; ఆర్‌ఆర్‌ను ఆదుకున్న శివమ్ దూబే, రాహుల్ తెవాటియా
IPL 2021 RCB vs RR: నేడు ముంబయి లోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది.
IPL 2021 RCB vs RR: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు ముంబయి లోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మేరకు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు లక్ష్యం 178 పరుగులుగా మారింది.
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్స్ పరుగులు రాబట్టేందుకు చాలా కష్టపడ్డారు. 2.3 ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 8 పరుగులు చేసిన బట్లర్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మనన్ వోహ్రా రూపంలో రాజస్తాన్ రాయల్స్ 16 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. కైల్ జేమిసన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన వోహ్రా రిచర్డ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో కూరుకపోయింది.
ఇన్నింగ్స్ 5వ ఓవర్లో సిరాజ్ వేసిన యార్కర్ మిల్లర్ ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. ఆర్‌సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటివ్వకపోవడంతో ఆర్‌సీబీ రివ్యూ కోరింది. రిప్లేలో బంతి ఇంపాక్ట్ వికెట్‌ను తాకుతూ వెళ్లడంతో మిల్లర్ డకౌట్ అయ్యాడు. ఆ తరువాత సుందర్ వేసిన ఇన్నింగ్స్ 8 ఓవర్లో సామ్సన్(21) మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
శివమ్ దుబే, రియాన్ పరాగ్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీలు చిక్కన్నప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు.
ఇన్నింగ్స్ కుదురుకుంటుందనుకున్న సమయంలో రియాన్ పరాగ్ (25 పరుగులు, 16 బంతులు, 4ఫోర్లు)ను హర్షాల్ పటేల్ బోల్తా కొట్టించాడు. ఆ తరువాత శివమ్ దుబే(46 పరుగులు, 32 బంతులు, 5ఫోర్లు, 2 సిక్సులు) కూడా 15.3 ఓవర్లో రిచర్డ్ సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు.
ఆ తరువాత రాహుల్ తెవాటియా(40 పరుగులు, 23 బంతులు, 4ఫోర్లు, 2 సిక్స్లులు), క్రిస్ మోరీస్(10 పరుగులు, 6 బంతులు, 1సిక్స్) చివర్లో మెరుపులు మెరిపించడంతో చెప్పుకోదగిన స్కోర్ చేసింది రాజస్థాన్ టీం.
ఇక బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హర్షాల్ పటేల్ చెరో 3 వికెట్లు, జమిషన్, రిచర్డ్ సన్, సుందర్ తలో వికెట్ పడగొట్టారు.