IPL 2021: క్రికెట్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్..మిగిలిన మ్యాచులుపై క్లారిటీ

IPL 2021: ఈ సీజన్‌ ఐపీఎల్ రెండో ద‌శ‌ షెడ్యూల్ పై మరింత స్పష్టత ఇచ్చారు.

Update: 2021-05-29 09:57 GMT

IPL 2021

IPL 2021: ఐపీఎల్ సీజ‌న్ 14 అర్థాంతరంగ వాయిదా ప‌డింది. బ‌యో బ‌బుల్ నీడ‌లో క‌రోనా బుస‌లు కొట్ట‌డంతో ఐపీఎల్ వాయిదా వేశారు నిర్వాహ‌కులు. ఇప్ప‌టికే 29 మ్యాచులు ముగిశాయి. అయితే మిగిలిన 31 మ్యాచులు నిర్వ‌హ‌ణ క‌ష్టత‌ర‌మైంది. ఐపీఎల్ నిర్వ‌హించ‌క‌పోతే మూడు వేల కోట్ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉండ‌టంతో బీసీసీఐ అంత‌ర్మథ‌నంలో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ మిగిన మ్యాచులు ఇంగ్లాండ్ నిర్వ‌హిస్తామ‌ని ఒక సారి.. సౌతాఫిక్రాలో నిర్వ‌హిస్తార‌ని మ‌రోసారి వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఈ సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ క‌స‌ర‌త్తు చేస్తోంది.

ఈ సీజన్‌ ఐపీఎల్ రెండో ద‌శ‌ షెడ్యూల్ పై మరింత స్పష్టత ఇచ్చారు. దీనిపై ఈ రోజు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. మిగిలిన‌ మ్యాచుల‌ను యూఏఈలో నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మొద‌టి ప‌దిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడించే అవ‌కాశం ఉంది. రెండో ద‌శ ఆట‌కు వేదిక ఖ‌రారైన నేప‌థ్యంలో దీనిపై త్వ‌ర‌లోనే షెడ్యూల్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

కాగా, కొన్ని రోజులుగా విదేశీ క్రికెట్ బోర్డుల‌తో బీసీసీఐ చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. క‌రోనా వేళ‌ విదేశీ ఆట‌గాళ్ల‌ను ఈ మ్యాచుల్లో ఆడించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అలాగే, టీ20 ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హ‌ణ‌కు స‌మ‌యం కోరుతోంది. అనంత‌రం ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ నిర్వ‌హించే చాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెండో ద‌శ ఐపీఎల్ మ్యాచుల భ‌వితవ్యం మొత్తం ఐసీసీ చేతిలో ముడిప‌డివుంది. ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హ‌ణ వాయిదా వేస్తే ఐపీఎల్ మ్యాచులు జ‌రిగేలా క‌నిపిస్తున్నాయి. క‌రోనా కార‌ణంగా గ‌త ఏడాది కూడా ఐపీఎల్ మ్యాచులు యూఏఈలో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News