RCB vs RR Match Preview: బెంగళూరుతో రాజస్థాన్ ఫైట్... గెలిచేదెవరో?
RCB vs RR Match Preview: నేడు (గురువారం) వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది.
RCB vs RR Match Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు (గురువారం) ముంబయి లోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ అన్నింటిలోనూ విజయం సాధించి ఫుల్ పామ్ లో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌లాడి.. రెండింటిలో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలని రాజస్థాన్ ఆరాటపడుతోంది.
ఎప్పుడు: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Rajasthan Royals vs Royal Challengers Bangalore), ఏప్రిల్ 22, 2021
ఎక్కడ: వాంఖడే స్గేడియం, ముంబై (Wankhede Stadium, Mumbai)
పిచ్: ఈ సీజన్ లో ఇప్పటి వరకు జరిగిన 7 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు సెకండ్ బ్యాటింగ్ లో గెలిచినవే. ఈ పిచ్ లో టాస్ గెలిచిన టీం ఛేజింగ్ కే మక్కువ చూపుతోంది. భారీ స్కోర్లు కూడా ఈ గ్రౌండ్ లో నమోదవుతున్నాయి.
ముఖాముఖి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10: రాజస్థాన్ రాయల్స్ 10; ఫలితం తేలనివి - 2
బెంగళూరు, రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు 22 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. మిగిలిన 20 మ్యాచ్‌ల్లో చెరో 10 గేమ్స్ లో గెలుపొందాయి.
మీకు తెలుసా?
ఆర్‌ఆర్‌పై 19 ఇన్నింగ్స్‌లలో ఏబీ డివిలియర్స్ 46.29 సగటుతో 648 పరుగులు చేశాడు. 146.61 స్ట్రైకింగ్ రేట్ గా ఉంది.
చేపాక్ వద్ద డెత్ ఓవర్లలో డివిలియర్స్ స్కోరింగ్ రేటు 247.50 కాగా, మిగతా బ్యాట్స్ మెన్లందరూ కలిపి 132.71 స్ట్రైకింగ్ రేట్ తో పరుగులు చేశారు.
ఈ సీజన్‌లో 14-20 ఓవర్లలో హర్షాల్ పటేల్ 7.5 ఓవర్లు బౌలింగ్ చేసి 9 వికెట్లు పడగొట్టాడు. మరియు ఓవర్ ఐదు కంటే తక్కువ పరుగులు ఇచ్చాడు.
టీంల బలాబాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
బెంగళూరు జట్టులో ఓపెనర్ దేవదత్ పడిక్కల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫర్వాలేదనిపిస్తున్నారు. కానీ, భారీ స్కోర్లు నమోదు చేయడంలో విఫలమవుతున్నారు. ఇక పవర్ హిట్టర్లు గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ విజయానికి కావాల్సిన పరుగులు సాధించడంలో సహాయపడుతున్నారు. అలాగే ఆల్‌రౌండర్ జెమీషన్ కూడా బ్యాట్ కి పనిచెబుతున్నాడు. అయితే నెం.3లో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్ దొరకడం లేదు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. జెమీషన్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఇక మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్.. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ అంచనాలకి మించి రాణిస్తున్నారు. మిడిల్ ఓవర్లలో చాహల్, వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకుంటున్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ సమతూకంగా కోహ్లీ సేన కనిపిస్తోంది.
రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నారు. మనన్ వోహ్రా, కెప్టెన్ సంజు శాంసన్ వరుసగా విఫలముతున్నారు. దీంతో.. మిడిలార్డర్‌పై ఎక్కువ భారం పడుతోంది. శివమ్ దూబే వచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటున్నాడు. రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా చివర్లో మెరుపులు మెరిపించినా..ఫలితం లేకుండా పోతోంది. ఇక డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరీస్ నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు.
బౌలింగ్ లో చేతన్ సకారియా చక్కగా రాణిస్తున్నాడు. మరో పేసర్ క్రిస్ మోరీస్ మినహా..ఎవ్వరూ సరైన ప్రదర్శన చేయలేక పోతున్నారు. జయదేవ్ ఉనద్కత్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ భారీగా పరుగులిస్తున్నారు. అలాగే స్పిన్నర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా ప్రభావం చూపలేకపోతున్నారు.
ప్లేయింగ్ లెవన్ (అంచనా)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజు సామ్సన్ (కెప్టెన్, కీపర్), శివం దుబే, డేవిడ్ మిల్లెర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్ / జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్