CSK vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

* కింగ్స్ తో పోటీకి రెడీ అయిన ఛాలెంజర్స్

Update: 2021-09-24 14:25 GMT

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై (ట్విట్టర్ ఫోటో)

CSK vs RCB: ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ తో షార్జా వేదిక మరో రసవత్తరపోరుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన చెన్నై టీం బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే కలకత్తా నైట్ రైడర్స్ టీంతో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడిన కోహ్లిసేన అటు బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ లోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది. అయితే ప్లే ఆఫ్ లో స్థానం పొందాలంటే బెంగుళూరు రానున్న మ్యాచ్ లలో విజయం సాధించక తప్పదు.

కలకత్తా జట్టు గురువారం ముంబై ఇండియన్స్ - కలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లోనూ కలకత్తా టీం అద్భుత ప్రదర్శనతో ఘనవిజయం సాధించడంతో ప్లేఆఫ్ లో స్థానం కోసం ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, ముంబై జట్లతో పోటీపడుతుంది. అయితే మరోపక్క చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే శుక్రవారం మ్యాచ్ లో బరిలోకి దిగుతుంది. గాలి తుఫాన్ కారణంగా మ్యాచ్ 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు: విరాట్ కోహ్లీ, దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భరత్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, టిమ్ డేవిడ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

Tags:    

Similar News