IPL 2020 updates : చెన్నై బౌలర్లను ఆడేసుకున్న రాజస్థాన్! సిఎస్కే విజయలక్ష్యం 217

IPL 2020 updates: ఐపీఎల్ 2020 సీజన్ లో తొలి పరుగుల సునామీ సృష్టించారు రాజస్థాన్ ఆటగాళ్ళు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ను ఓ ఆట ఆడుకున్న రజస్థాన్ భారీ లక్ష్యాన్ని ఆ జట్టుకు నిర్దేశించింది.

Update: 2020-09-22 16:19 GMT

చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ని ఓ ఆట ఆడేశారు రాజస్థాన్ బ్యాట్స్ మెన్. అలా ఇలా కాదు బంతి దొరికితే సిక్స్ అంతే.. కొద్దిగా అటూ ఇటూ అయితే బౌండరీ.. ప్రారంభం పేలవం.. కానీ ముగింపు ఘనం సింపుల్ గా చెప్పాలంటే రాజస్థాన్ బ్యాటింగ్ తీరు ఇది. చాహర్‌ వేసిన మూడో ఓవర్‌ రెండో బంతికి యువ బ్యాట్స్‌మన్‌ యశస్వి జైశ్వాల్‌(6) ఔటయ్యాడు. దీంతో సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. అక్కడ నుంచి మెల్లగా పరుగుల వరద ప్రారంభం అయింది ఎలా అంటే..

* ఎంగిడి వేసిన 4వ ఓవర్‌లో మొత్తం 9 పరుగులు వచ్చాయి. స్మిత్‌(16) తొలి బంతికే ఒక భారీ సిక్సర్‌ బాదాడు. అనంతరం మరో మూడు పరుగులు వచ్చాయి. దీంతో నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్‌ 26/1తో నిలిచింది.

* చాహర్‌ వేసిన ఆరో ఓవర్‌లో శాంసన్‌ ఒక సిక్సర్‌.. తర్వాత స్మిత్‌(32) ఒక ఫోర్‌బాదేశారు. దీంతో ఏఓవర్లొ రాజస్థాన్‌ మొత్తం 14 పరుగులు రాబట్టింది. *

* ఏడో ఓవర్‌లో శాంసన్‌ చెలరేగిపోయాడు. వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. జడేజా వేసిన ఈ ఓవర్లో రాజస్థాన్‌ మొత్తం 14 పరుగులు సాధించింది.

* పీయూష్‌ చావ్లా వేసిన 8వ ఓవర్లో శాంసన్‌ మొత్తం 3 సిక్సర్లు బాదాడు. దీంతో 19 బంతుల్లో శాంసన్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో మొత్తం 28 పరుగులు వచ్చాయి.

* జడేజా వేసిన 9వ ఓవర్లో రాజస్థాన్‌ ఆటగాళ్లు నిలకడగా ఆడారు. ఈ ఓవర్‌ ముగిసేసరికి రాజస్థాన్‌ స్కోరు 100 పరుగులకు చేరింది. *

* ఇక చావ్లా వేసిన 10వ ఓవర్లో స్మిత్‌, శాంసన్ బౌండరీలతో రెచ్చిపోయారు. స్మిత్‌ ఒక సిక్సర్‌, ఓ బౌండరీ బాదగా, శాంసన్‌ సైతం మరో సిక్సర్‌ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో19 పరుగులు వచ్చాయి.

* ఎంగిడి వేసిన 12వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది రాజస్తాన్. సంజూ శాంసన్‌(74) ఔటయ్యాడు. మూడో బంతికి భారీ సిక్సర్‌ కొట్టిన అతడు నాలుగో బంతిని కూడా భారీ షాట్‌ ఆడబోయి దీపక్‌ చాహర్‌ చేతికి చిక్కాడు. అతడు ఔటయ్యాక స్మిత్‌(50) అర్ధశతకం సాధించదువు. తరువాత చివరి బంతికి డేవిడ్‌ మిల్లర్‌ (0) రనౌటయ్యాడు.

* అర్ధశతకం దాటాక స్టీవ్‌స్మిత్‌ బ్యాట్ ఝుళిపించాడు. జడేజా వేసిన 14వ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. అందులో స్మిత్ భారీ సిక్సర్‌ ఉంది. అ

* చావ్లా వేసిన 15 ఓవర్‌లో తొలి బంతికే రాబిన్‌ ఉతప్ప(5) ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడబోయి డుప్లెసిస్‌ చేతికి చిక్కాడు. తర్వాత రాహుల్‌ తివాతియా(3) క్రీజులోకి వచ్చి మూడు సింగిల్స్‌ తీశాడు. దీంతో 15 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 154/4కి చేరింది.

* సామ్‌ కరన్‌ వేసిన 17వ ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌ తివాతియా(10)ఎల్బీగా ఔటయ్యాడు.

* ఇక తరువాత జోఫ్రా ఆర్చర్ షో మొదలైంది. ఎంగిడి వేసిన 20 వ ఓవర్లో జోఫ్రాఆర్చర్‌(27) నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో ఈ ఒక్క ఓవర్లో 30 పరుగులు పిండేసింది రాజస్తాన్.

మొత్తమ్మీద రాజస్థాన్ 20 ఓవర్లకు ఏడూ వికెట్లు కోల్పోయి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

ఈ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Tags:    

Similar News