IPL 2020 Updates: యూఏఈలో ఐపీఎల్‌కు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్
IPL 2020 Updates: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను యూఏఈలో నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
IPL 2020 Updates: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను యూఏఈలో నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక ఆమోదం లభించింది. ఇప్పటికే సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరిగేలా బీసీసీఐ ప్రాథమిక షెడ్యూల్‌ని తయారు చేసింది.
వాస్తవానికి ఐపీఎల్ 2020 సీజన్‌ను తమ దేశంలో నిర్వహిస్తామని గతంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బీసీసీఐకి ప్రతిపాదన చేసింది. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. కానీ రోజురోజుకూ దేశంలో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో .. భారత్‌లో ఐపీఎల్ 2020 నిర్వహణ అసాధ్యమని భావించింది. దీంతో తాజాగా ఈసీబీ చేసిన ప్రతిపాదనకు బీసీసీఐ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఓ లేఖని కూడా ఈసీబీకి పంపినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తాజాగా స్పష్టం చేశాడు. ఈ మేరకు ఫ్రాంఛైజీలకి కూడా సమాచారమిచ్చి నెల రోజుల ముందుగానే యూఏఈకి జట్లని తరలించాలని సూచించినట్టు సమాచారం. 2008 నుంచి ఐపీఎల్ నిర్వహిస్తుండగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. కానీ.. కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే భారత్ వెలుపల ఐపీఎల్ మ్యాచ్‌ల్ని బీసీసీఐ నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా నిర్వహించగా, 2014 ఎన్నికల సందర్భంలో కొన్ని మ్యాచ్‌లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది.