IPL 2020 Update : బీసీసీఐకి ఫస్ట్ టైమ్ కొత్త ఛాలెంజ్

IPL 2020 Update : బీసీసీఐకి బంగారు బాతులాగా నిలిచిందనే చెప్పాలి ఐపీఎల్.. ప్రతి ఏటా నిర్వహించే టోర్నీ ద్వారా దాదాపుగా 2000 వేల కోట్లను

Update: 2020-08-04 10:00 GMT
IPL

IPL 2020 Update : బీసీసీఐకి బంగారు బాతులాగా నిలిచిందనే చెప్పాలి ఐపీఎల్.. ప్రతి ఏటా నిర్వహించే టోర్నీ ద్వారా దాదాపుగా 2000 వేల కోట్లను అర్జిస్తుంది బీసీసీఐ.. దీనితో ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా ఎదిగింది బీసీసీఐ.. అంతేకాకుండా ఐసీసీ‌ని సైతం శాసించే స్థాయికి చేరుకుంది .. ఇక ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ మాత్రం బీసీసీఐకి పెద్ద సవాల్ గా మారింది. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ని భారత్ లో నిర్వహించేందుకు అవకాశం లేకపోవడంతో టోర్నీకి UAEకి షిఫ్ట్ చేసింది.

అక్కడ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించేలా ప్లాన్ చేసింది బీసీసీఐ.. దీనికి సంబంధించిన షెడ్యుల్ ని త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఇంతవరకు బాగానే ఉన్న బీసీసీఐకి ఇప్పుడో కొత్త ఛాలెంజ్ మొదలైంది. అదేంటంటే.. టోర్నీలోని ఎనిమిది జట్లని అక్కడికి చేర్చడం, వారికి కరోనా పరీక్షలు నిర్వహించడం, అందులోనూ 14 రోజులు క్వారంటైన్.. ఇక క్రికెటర్లతో పాటు మ్యాచ్ అధికారులు, కోచ్‌లు, సహాయ సిబ్బందిని బయో-సెక్యూర్ బబుల్‌లోకి చేర్చడం వంటివి ఇప్పుడు బీసీసీఐకి పెద్ద సవాల్ గా మారనున్నాయి.

మొత్తం మ్యాచ్ లను యూఏఈలోని మూడు స్టేడియంలో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ప్రయాణాలు లేదా మ్యాచ్‌ల మధ్యలో ఈ బబుల్ నుంచి ఏ ఒక్కరు రహస్యంగా బయటికి వెళ్లి.. మళ్లీ బబుల్‌లోకి ఎంటరైనా.. మొత్తం బబుల్ సిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి ఫ్రాంఛైజీలకి కూడా జాగ్రత్తగా ఉండాలని వారికీ సూచించినట్టుగా తెలుస్తోంది. దీనితో ఆటగాళ్ళ పైన టోర్నీ ముగిసే వరకూ 24 గంటలూ నిఘా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Tags:    

Similar News