తడబడ్డ బెంగుళూరు.. హైదరాబాద్‌ లక్ష్యం 132

హైదరాబాద్‌, బెంగుళూరు జట్ల మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన మ్యాచ్ లో బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఏడూ వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది

Update: 2020-11-06 15:52 GMT

హైదరాబాద్‌, బెంగుళూరు జట్ల మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన మ్యాచ్ లో బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఏడూ వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. దీనితో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగుళూరు జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.. ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ (7) పరుగులకే అవుట్ అయ్యాడు.. అయితే ఈ షాక్ నుంచి బయట పడకముందే ఆ జట్టుకి మరో షాక్ తగిలింది.. మరో ఓపెనర్ పడిక్కల్‌ (1) కూడా వెంటనే ఔట్‌ అయ్యాడు..

ఆ తర్వాత ఫించ్, డివిలియర్స్‌ కాసేపు నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచారు.. అయితే జట్టు స్కోర్ 45 పరుగుల వద్ద షాబాజ్‌ వేసిన 10 ఓవర్ లోని రెండో బంతికి భారీషాట్‌కు యత్నించిన ఫించ్‌ (32) ఔట్ అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన మొయిన్‌ అలీ కూడా రనౌట్‌ కావడంతో బెంగుళూరు జట్టు కష్టాల్లో పడింది.. ఒకపక్కా వికెట్లు పడుతున్న డివిలియర్స్ మాత్రం స్పీడ్ గానే ఆడుతూ జట్టు స్కోర్ పెంచాడు.. ఈ క్రమంలో బెంగుళూరు జట్టు 16 ఓవర్లకు 104 పరుగులు చేసింది..

అనంతరం ఆఫ్ సెంచరీ పూర్తి చేసిన డివిలియర్స్ 18 ఓవర్ లో నటరాజన్‌ వేసిన రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఇక మిగతా బాట్స్ మెన్స్ పెద్దగా రాణించకపోవడంతో బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఏడూ వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.. హైదరాబాద్‌ జట్టు బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు తీస్తే, నటరాజన్ 2, నదీమ్ ఒక వికెట్ తీశారు... ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయిర్-2కు చేరుతుంది. ఓటమిపాలైన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Tags:    

Similar News