IPL 2020: వాటిని అస్సలు.. లెక్కచేయను: ఆశ్విన్
IPL 2020: ఐపీఎల్.. క్రికెట్ తీరును పూర్తి మర్చివేసిన ఫార్మట్. ఇందులో బ్యాట్మెన్స్ మెరుపులే కాదు. రాకెట్ లా వేగంగా.. బంతులు విసిరే బౌలర్లు . అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనలు
IPL 2020: ఐపీఎల్.. క్రికెట్ తీరును పూర్తి మర్చివేసిన ఫార్మట్. ఇందులో బ్యాట్మెన్స్ మెరుపులే కాదు. రాకెట్ లా వేగంగా.. బంతులు విసిరే బౌలర్లు . అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనలు. ఐపీఎల్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్, బౌలర్లకు ఇచ్చే ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు ఇస్తుంటారు. అయితే .. క్యాప్ లపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను ఏమాత్రం లెక్క చేయనని అన్నాడు. కేవలం మన ఆటతీరుతో జట్టును గెలిపించడమే ముఖ్యమని అతను అభిప్రాయపడ్డాడు.
వ్యక్తిగత ప్రయోజనాల కంటే.. జట్టు గెలుపే ముఖ్యమని అన్నారు. జట్టు గెలవనంత వరకు ఇలాంటివన్నీ పనికిమాలినవి. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు అనే కేవలం కంటితుడుపులాంటివి. జట్టు గెలుపులో మన పాత్రను సమర్థంగా పోషించామా లేదా అన్నదే ముఖ్యమన్నారు. కాగా, ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 144 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 6.81 ఎకానమితో 131 వికెట్లు తీశాడు.