IPL 2020: ఒక్క సిక్స్ కొడితే మొత్తం మారిపోతుందని తెలుసు!
IPL 2020: రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు రాహుల్ తేవతియా ఇన్నింగ్స్ ఓ అద్భుతం. ఆయన బ్యాటింగ్ చూసి తీరాల్సిందే. 18వ ఓవర్లో రాహుల్ బ్యాట్ ధాటికి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది
IPL 2020: రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు రాహుల్ తేవతియా ఇన్నింగ్స్ ఓ అద్భుతం. ఆయన బ్యాటింగ్ చూసి తీరాల్సిందే. 18వ ఓవర్లో రాహుల్ బ్యాట్ ధాటికి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ మెరుపు సెంచరీ, పూరన్ అద్భుత ఫీల్డింగ్ లను మయ మారిపించి, క్రికెట్ అభిమానులను తన వైపునకు తిప్పుకున్నాడు రాహుల్.
17 వ ఓవర్ వరకూ రాహుల్ తేవతియా 17 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్థాన్ లక్ష్యం చేధించాలంటే 3 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సి ఉంది. దాదాపు రాయల్స్ ఓటమి ఖరారైందని అనిపించింది. ఈ సమయంలో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 18వ ఓవర్ వేయడానికి కాట్రెల్‌ను రంగంలోకి దింపాడు. ఆ ఓవర్‌ను తేవతియా, కాట్రెల్‌కు తన జీవితంలో మరిచిపోలేని ఓవర్‌గా మార్చేశాడు.
మొదటి బంతికి సిక్సర్. ఆ తరువాత రెండు, మూడు బంతులకు కూడా వరసగా సిక్సర్లు. నాలుగో బంతి టాస్ బాల్. దాన్ని కూడా తేవతియా మైదానం వెలుపలికి నేరుగా కొట్టాడు. అయిదో బంతికీ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను పూర్తిగా మ్యాచ్ స్వరూపం మార్చివేసాడు. ఆ తరువాత ఓవర్లో షమీ బౌలింగులో మరో సిక్సర్ కొట్టి ఐపీఎల్‌లో తన తొలి అర్థ సెంచరీని నమోదు చేశాడు. రాహుల్ ఆ తరువాత బంతికి ఔట్ అయినప్పటికీ 31 బంతుల్లో 53 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని పక్కా చేశాడు.
రాజస్థాన్ విజయం అనంతరం రాహుల్ తెవాతియా మాట్లాడుతూ.. ఒక్క సిక్సర్‌తో కథ మారిపోతుందని తనకు ముందే తెలుసని రాహుల్ తెవాతియా అన్నాడు. అయితే ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం మాత్రం అద్భుతమే. నిజానికి లెగ్‌స్పిన్‌లో షాట్లు ఆడేందుకు ప్రయత్నించా. కానీ కుదర్లేదు. అందుకే మిగతా బౌలర్ల బౌలింగ్‌లో దంచేశా. ఇప్పుడు నేను మెరుగ్గా ఉన్నాను. మొదట 20 బంతుల్లో ఆడినట్టు ఎప్పుడూ ఆడలేదు. ఆ తర్వాత బాదడం షురూ చేశాను' అని తెవాతియా చెప్పాడు.