IPL 2020 Match 17 Updates : సన్ రైజర్స్ ఓటమి!

IPL 2020 Match 17 Updates : ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడిన ఐపీఎల్ 2020 టోర్నీలో 17వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Update: 2020-10-04 14:26 GMT

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్.. ఫీల్డింగ్ తొ హైదరాబాద్ ను కట్టడి చేసింది. దీంతో హైదరాబాద్ జట్టు 34పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం హైదరాబాద్ కొంప ముంచింది. ఒక్క డేవిడ్‌ వార్నర్‌(60; 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఎవరూ హాఫ్‌ సెంచరీ మార్కును చేరలేదు. జానీ బెయిర్‌ స్టో(25), మనీష్‌ పాండే(30), అబ్దుల్‌ సామద్‌(20)లు కాసేపు మెరుపులు మెరిపించినా సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడలేదు. దాంతో సన్‌రైజర్స్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

* బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌లో బెయిర్‌స్టో సిక్సర్‌ బాది ఖాతా తెరిచాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. ఓవర్‌ ముగిసేసరికి హైదరాబాద్‌ 8/0

* కృనాల్‌ పాండ్య వేసిన మూడో ఓవర్‌లో హైదరాబాద్‌ 10 పరుగులు రాబట్టింది. బెయిర్‌స్టో(24)ఈ ఓవర్‌లో భారీ సిక్సర్‌ కొట్టడంతో పాటు మరో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో 3 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 30/0కి చేరింది. వార్నర్‌(3) పరుగులతో ఉన్నాడు.

* బౌల్ట్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి బెయిర్‌స్టో(25) ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ వద్ద హార్దిక్‌ పాండ్య చేతికి చిక్కాడు. 5 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 42/1తో నిలిచింది. వార్నర్‌(6) పరుగులతో ఉన్నాడు.

* బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో డేవిడ్‌ వార్నర్‌ రెండు ఫోర్లు బాదగా, మనీష్‌ పాండే మరో ఫోర్‌ కొట్టడంతో పాటు మరో రెండు పరుగులు వచ్చాయి. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు రాగా జట్టు స్కోర్‌ 56/1గా నమోదైంది.

* రాహుల్ చాహర్‌ బౌలింగ్‌లో మనీష్‌ పాండే, వార్నర్‌ చెరో సిక్సర్‌ బాదారు. దీంతో వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు హైదరాబాద్‌ 86/1

* ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో మనీష్‌ పాండే (30) భారీ షాట్‌కు యత్నించి పొలార్డ్‌ చేతికి చిక్కాడు. 10 ఓవర్లకు హైదరాబాద్‌ 94/2

* బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. 12వ ఓవర్‌లో 6 పరుగులే ఇచ్చాడు. వార్నర్‌ (50) ఆఖరి బంతికి సింగిల్‌ తీసి 35 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. 12 ఓవర్లకు హైదరాబాద్‌ 115/2

* కృనాల్ పాండ్య బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ప్రియమ్‌ గార్గ్‌ (8) రాహుల్ చాహర్ చేతికి చిక్కాడు. బౌండరీ లైన్‌లో కష్టతర క్యాచ్‌ను‌ చాహర్ అద్భుతంగా అందుకున్నాడు. ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు హైదరాబాద్‌ 139/4

* ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో వార్నర్ (60)‌ షాట్‌కు యత్నించి ఇషాన్‌ చేతికి చిక్కాడు. గాల్లోకి డైవ్‌ చేస్తూ ఇషాన్‌ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. 16 ఓవర్లకు హైదరాబాద్ 144/5. 

అంతకు ముందు టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ తీసుకోవడంతో రోహిత్‌ శర్మ-డీకాక్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కాగా, రోహిత్‌ శర్మ(6) త్వరగా అవుట్ అయ్యాడు. సందీప్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్‌ ఔటయ్యాడు. ఆపై డీకాక్‌-సూర్యకుమార్‌ యాదవ్‌లు ఇన్నింగ్స్‌ నడిపించారు. ఈ సీజన్‌లో ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న డీకాక్‌ ఎట్టకేలకు టచ్‌లోకి వచ్చాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇది డీకాక్‌కు ఈ ఐపీఎల్‌లో తొలి హాఫ్‌ సెంచరీ.

డీకాక్‌- సూర్యకుమార్‌ యాదవ్‌లు 42 పరుగులు జత చేశారు. ఇక ఇషాన్‌ కిషన్‌ 23 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లతో 31 పరుగులు సాధించాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేయగా, పొలార్డ్‌ 13 బంతుల్లో 3 సిక్స్‌లతో అజేయంగా 25 పరుగులు చేశాడు. కృనాల్‌ పాండ్యా 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సిద్ధార్థ్‌ కౌల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో కృనాల్‌ బ్యాట్‌ ఝుళిపించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. రషీద్‌ ఖాన్‌కు వికెట్‌ దక్కింది.

Tags:    

Similar News