మెరిసిన మోర్గాన్.. రాజస్థాన్ లక్ష్యం 192 రన్స్ !
రాజస్థాన్, కోల్‌కతా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కతా జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఏడూ వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కోల్‌కతా జట్టుకు ఆదిలోనే దెబ్బ తగిలింది.
రాజస్థాన్, కోల్‌కతా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కతా జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఏడూ వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కోల్‌కతా జట్టుకు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ రాణా ఎదురుకున్న తొలి బంతికే అవుట్ అయ్యాడు.. ఇక ఆ తర్వాత వచ్చిన త్రిపాఠి, గిల్ తో కలిసి ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్ ని పెంచాడు. ఇద్దరు కలిసి వీడు చిక్కినప్పుడల్లా అద్భుతమైన షాట్లతో అదరగొట్టారు. అయితే వీరి భాగస్వామ్యాన్ని తెవాతియా విడదీశాడు. తెవాతియా బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించి గిల్(36), బట్లర్ కి చిక్కి అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన సరైన్ కూడా డకౌట్ అయ్యాడు.
అప్పటికి కలకత్తా జట్టు స్కోర్ 74పరుగులుగా ఉంది.. ఆ తర్వాత వచ్చిన మోర్గాన్ భారీ షాట్లతో విరుచుకపడ్డాడు.. మోర్గాన్ కి తోడు రసెల్ కూడా తోడవ్వడంతో రాజస్థాన్ నిర్ణిత 20 ఓవర్లలలో ఏడూ వికెట్ల కోల్పోయి 191 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉంటే అటు పాయింట్ల పట్టికలో రాజస్థాన్ ఆరో స్థానంలో ఉండగా, కోల్‌కతా ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇరు జట్లకు ఫ్లేఆఫ్స్ ఆశలు పదిలంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రెండు జట్లు 12 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్‌లో మాత్రం కలకత్తా కంటే రాజస్థాన్ మెరుగ్గా ఉంది.