IPL 2020: బీసీసీఐకి తలకు మించిన భారం.. రూ.10 కోట్లతో 20వేల టెస్టులు
IPL 2020: దుబాయిలో ఐపీఎల్ నిర్వహణ అంటే ఖర్చు బాగానే ఉంటుంది. అటూ ప్రాంచేజీలకు .. ఇటూ బీసీసీఐకీ బడ్జెట్ పెరగనున్నది. ఆటగాళ్ల ఖర్చు ఫ్రాంఛైజీలు భరించనుండగా.. స్టేడియం, ఇతర ఖర్చులు బీసీసీఐ భరించనున్నది.
IPL 2020: దుబాయిలో ఐపీఎల్ నిర్వహణ అంటే ఖర్చు బాగానే ఉంటుంది. అటూ ప్రాంచేజీలకు .. ఇటూ బీసీసీఐకీ బడ్జెట్ పెరగనున్నది. ఆటగాళ్ల ఖర్చు ఫ్రాంఛైజీలు భరించనుండగా.. స్టేడియం, ఇతర ఖర్చులు బీసీసీఐ భరించనున్నది. అయితే బీసీసీఐకి అదనంగా 10 కోట్లు ఖర్చు కానున్నది.
ఐపీఎల్ స్వదేశంలో జరిగినప్పటీ కంటే.. విదేశాల్లో నిర్వహించినప్పుడూ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ అన్ని సౌకర్యాలు అద్భుతంగా ఉండే దుబాయిలో అంటే.. ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం కొత్త స్పానర్స్ రావడంతో తెరుకున్నది.. అయినా.. బీసీసీఐకి ఖర్చు తడిసి మోపాడు అయ్యేలా ఉంది. యూఏఈలో అడుగుపెట్టిన తర్వాత నిర్వహిస్తున్న ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల ఖర్చును బీసీసీఐ భరించనుంది. ఇందు కోసం రూ.10కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయించింది.
కంపెనీకి చెందిన 75 మంది హెల్త్‌కేర్ వర్కర్లు ఐపీఎల్ టెస్టింగ్ ప్రక్రియలో భాగమే' అని ఐపీఎల్ సీనియర్ అధికారి చెప్పారు. 'ఆటగాళ్లు, అధికారుల భద్రతకు సంబంధించి ఎలాంటి అలసత్వం వహించేది లేదు. హెల్త్‌కేర్ వర్కర్లు ప్రత్యేక హోటల్‌లో ఉంటారని' ఆయన వివరించారు. పన్నులు కాకుండా ప్రతి పరీక్షకు బీసీసీఐకి 200 దిర్హామ్‌ల (రూ.4వేలు) ఖర్చు అవుతుంది.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. దాంతో టోర్నీ ముగిసే వరకూ కరోనా టెస్టుల కోసం యూఏఈలోని ఒక వీపీఎస్ హెల్త్ కేర్ సెంటర్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 13వ సీజన్ కోసం ఆగస్టు 20న యూఏఈకి అన్ని జట్లు చేరుకోగా.. అప్పటి నుంచే కరోనా టెస్టులు మొదలుపెట్టిన వీపీఎస్ సంస్థ.. ఇప్పటికే దాదాపు 2000 టెస్టులు చేసినట్లు తెలుస్తోంది.
టోర్నీ జరిగే సమయంలోనూ ప్రతి ఐదు రోజులకి ఒకసారి క్రికెటర్‌కి కరోనా వైరస్ పరీక్షలు చేయాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. టీమ్ సపోర్ట్ స్టాఫ్, హోటల్ సిబ్బంది, ట్రావెల్, ఫ్రాంఛైజీల మేనేజ్‌మెంట్ ఉద్యోగులు ఇలా పెద్ద సంఖ్యలో ఆటగాళ్లతో కాంటాక్ట్ అయ్యే వారికి కూడా రెగ్యులర్‌గా కరోనా టెస్టులు చేయనున్నారు. మొత్తంగా టోర్నీ ముగిసేలోపు సుమారు 20,000 టెస్టులు చేయనున్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది.