IPL 2020: బ్యాట్ పట్టాలంటే భయమేసింది: విరాట్‌కోహ్లీ
IPL 2020: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 ఎట్టకేలకు యూఏఈ వేదికగా ప్రారంభం కాబోతున్నది. అభిమానులు తమ ఇష్టమైన ఆటగాళ్ల ప్రదర్శనను చూడడానికి ఎంతగానో వేచి ఉన్నారు.
IPL 2020: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 ఎట్టకేలకు యూఏఈ వేదికగా ప్రారంభం కాబోతున్నది. అభిమానులు తమ ఇష్టమైన ఆటగాళ్ల ప్రదర్శనను చూడడానికి ఎంతగానో వేచి ఉన్నారు. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
కరోనా విరామం తరువాత బ్యాట్ పట్టి సాధన చేయాలంటే.. చాలా భయంగా ఉందని అన్నారు. ఐపీఎల్ 2020 టోర్నీ కోసం గతవారమే యూఏఈకి వెళ్లింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ టీం క్వారంటైన్ ను ముగించి.. ప్రాక్టీస్ ను మొదలు పెట్టింది. ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. బ్యాటింగ్ చేయడానికి చాలా భయపడ్డానని, అయితే అనుకున్న దాని కంటే కాస్త ఈజీగానే ఉందన్నాడు.
' లాక్‌డౌన్ సమయంలో బ్యాట్ పట్టలేదు. కానీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాను. అదే ప్లస్ పాయింట్ అయింది. బాడీ తేలికగా అనిపిస్తే ప్రాక్టీస్ చేయడం చాలా సులభం. గతంలో లాగ శరీరం అంతగా సహకరించడం లేదు కానీ ఊహించిన దాని కన్నా బెటర్‌గా చురుకుగా కదులుతున్నానని తన ఫిట్ నెస్ గురించి కోహ్లీ వెల్లడించాడు. డెల్ స్టెయిన్, ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెసన్ సైతం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. స్పిన్ త్రయం షాబాజ్ నదీమ్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ బాగా వేశారని' తొలి ప్రాక్టీస్ సెషన్ తర్వాత కోహ్లీ వివరించాడు.