IPL 2020: అంపైర్‌పై ధోనీ ఫైర్
IPL 2020: రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంపైర్‌పై సీరియస్ అయ్యాడు.
IPL 2020: రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంపైర్‌పై సీరియస్ అయ్యాడు. టామ్ కరన్ ఔట్ విషయంలో ఈ ఘటన జరిగింది. దీపక్ చాహర్ వేసిన 18 వ ఓవర్లో బంతి .. టామ్ కరన్ తొడ ప్యాడ్‌కు తాకి వెనక్కి వెళ్లగా ధోనీ అందుకున్నాడు. చాహర్ అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. టామ్ సమీక్ష కోరాడు కానీ రాజస్థాన్‌కు అప్పటికే అవి అయిపోయాయి. దీంతో అతడు పెవిలియన్ బాటపట్టాడు. ఈలోపు అంపైర్లిద్దరూ చర్చించుకుని, రివ్యూ తీసుకున్నారు. దీంతో వారిపై దీనితో ధోని ఫైర్ అయ్యాడు.
అంపైర్ క్యాచ్ ఔట్ అన్న ఉద్దేశంతో వేలెత్తినట్లు స్పష్టం కాగా.. అసలు బంతి బ్యాట్‌ను తాకలేదని, ధోనీ అందుకునే ముందు నేలను కూడా తాకిందని వెల్లడైంది. దీంతో టామ్ నాటౌట్ అని ప్రకటించారు. ఇప్పటికే లీగ్‌లో అంపైరింగ్‌పై విమర్శలొస్తుండగా.. తాజా వివాదంతో అవి మరింత పెరిగాయి. తప్పు ఉందని తెలిసినా ధోనీ అంపైర్‌తో గొడవ పెట్టుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఐపీఎల్ 2019 సీజన్‌లోనూ ఇలానే నోబాల్ విషయంలోనూ ధోనీ ఇలానే అంపైర్లతో గొడ పెట్టుకున్న సంగతి తెలిసిందే.