ఢిల్లీని చిత్తు చేసిన ముంబై
ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 14.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్(72 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్ తో ఆదరగోట్టడంతో ముంబైకి విజయం నల్లేరు పైన నడక లాగే సాగింది.
ముంబై, ఢిల్లీ జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో ఆదరగొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. తొలుత ముంబై టాస్ గెలిచి ఢిల్లీ జట్టుకు బ్యాటింగ్ ఇవ్వగా బుమ్రా, బౌల్ట్ బౌలర్ల దాటికి ఢిల్లీ బాట్స్ మెన్స్ ఒక్కరు కూడా క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోయారు. దీనితో ఢిల్లీ జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో తొమ్మిది వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బాట్స్ మెన్స్ లలో శ్రేయస్ అయ్యర్ 25(29) ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఆ తరవాత బ్యాటింగ్ లో కూడా ఆదరగోట్టింది ముంబై జట్టు... ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 14.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్(72 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్ తో ఆదరగొట్టడంతో ముంబైకి విజయం నల్లేరు పై నడక లాగే సాగింది. అటు క్వింటన్ డికాక్(26), సూర్యకుమార్ యాదవ్(12 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతానికి ముంబయి జట్టు 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.