IPL 2020: ఆరెంజ్ ఆర్మీతో.. యెల్లో ఆర్మీ 'కీ' ఫైట్

IPL 2020: ఐపీఎల్ భార‌త యువ కెర‌టాలను స‌రైన వేదిక‌. త‌న ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి ప‌రిచయం చేసుకోవ‌డానికి మంచి అవ‌కాశం. ఇప్ప‌టికే యువ క్రికెట‌ర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్ప‌టికే అనేక మంది.. ఆట‌గాళ్లు వెలుగులోకి వ‌చ్చారు.

Update: 2020-10-13 09:27 GMT

IPL 2020: ఆరెంజ్ ఆర్మీతో.. యెల్లో ఆర్మీ కీ ఫైట్

IPL 2020:  ఐపీఎల్ భార‌త యువ కెర‌టాలను స‌రైన వేదిక‌. త‌న ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి ప‌రిచయం చేసుకోవ‌డానికి మంచి అవ‌కాశం. ఇప్ప‌టికే యువ క్రికెట‌ర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్ప‌టికే అనేక మంది.. ఆట‌గాళ్లు వెలుగులోకి వ‌చ్చారు. ఇక ప్ర‌తి మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండుగ గా మారింది. చివ‌రి ఓవ‌ర్లో.. చివ‌రి బంతి వ‌ర‌కూ... ఉత్కంఠగా సాగుతున్నాయి. నేడు కూడా అలాంటి ఉత్కంఠ మ్యాచ్ జ‌రుగునున్న‌ది. ఈ రోజు ఐదో స్థానంలో ఉన్న‌స‌న్‌రైజ‌ర్స్ హైద‌ర‌బాద్, ఏడో స్థానంలో ఉన్న‌చెన్నై సూపర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే సన్‌రైజర్స్ మూడు విజయాలు సాధించగా.. ధోనీ సేన కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే.. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం.

ఏడు మ్యాచుల్లో కనీసం 5-6 మ్యాచులు నెగ్గితేనే ప్లే ఆఫ్స్‌ రేసులో నిలబడతాయి. లేదంటే లీగ్‌ దశ నుంచే నిష్కమించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఏడాది చెన్నై ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ పూర్తిగా వైఫల్యం అవుతోంది. ఓపెనర్ షేన్ వాట్సన్, డుప్లెసిస్ మినహా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. చెన్నైకు మిడిల్ ఆర్డర్ సెట్ అయితే.. ఆ జట్టు ఖచ్చితంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. అలాగే ధోని మళ్లీ ఫినిషర్ స్థానాన్ని తీసుకుంటే సీఎస్‌కేకు తిరుగుండదని అభిమానులు భావిస్తున్నారు. 

అటు సన్‌రైజర్స్ కూడా సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఉన్నాయి. ఆ జట్టు ఓపెనర్స్ మొదట్లో క్రీజులో నిలదొక్కుకునేందుకు టైం తీసుకోవడంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ టెస్ట్ మ్యాచ్‌లాగ ఆడుతుండటం వారికి ఇబ్బంది కలిగిస్తోంది. గ‌త మ్యాచ్ లో ప్రియమ్ గార్గ్ పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నప్పటికీ.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడంతో.. అతణ్ని కొననసాగించే అవకాశం ఉంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ అతణ్నే ఆడించొచ్చు. అయితే బౌలర్లు మాత్రం సమిష్టిగా రాణిస్తున్నారు. రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, నటరాజన్, సందీప్ శర్మలతో బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఈ రెండు జట్లలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News