సూసైడ్ చేసుకుందామనుకున్నా.. టీమిండియా సీనియర్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ క్రికెటర్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా సీనియర్ క్రికెటర్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెరీర్‌లో తాను కుంగుబాటుకు గురైయ్యానని ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలు తనను వెంటాడాయని తెలిపారు.కెరీర్‌లో తాను రెండేళ్ల పాటు కుంగుబాటుతో ఇబ్బంది పడ్డానని ఉతప్ప తన అంతరంగాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. ''2009 నుంచి 2011 వరకు కుంగుబాటుతో ప్రతి రోజు సతమతమయ్యేవాణ్ని. అసలు నా కిష్టమైన క్రికెట్ గురించి ఆలోచించని సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.
అయితే బాల్కనీ నుంచి దూకడానికి సిద్ధమైన తనను కొన్నిసార్లు ఆపింది కూడా క్రికెట్ ఒక్కటేనని చేర్పుకోచ్చాడు. నా జీవితంలో మరో దిశగా నేను వెళ్తున్నా అని నిత్యం ఆలోచిస్తుండేవాణ్ని. క్రికెట్ ఈ ఆలోచనలను దూరం చేసేది. కానీ మ్యాచ్‌లేని రోజుల్లో, క్రికెట్ సీజన్ లేనప్పుడు చాలా జీవితం ఎంతో భారంగా అనిపిస్తుంది. ఓ రోజూ ఇంట్లో కూర్చుని ఉన్నా. బాల్కనీ నుంచి దూకుడం గురించి ఆలోచిస్తూ మూడు అంకెలు లెక్కపెట్టడం మొదలెట్టా. కానీ ఏదో నన్ను ఆపింది అని 34 ఏళ్ల ఉతప్ప వెల్లడించాడు. ఆ తర్వాత మానసిక నిపుణుడి సహాయంతో ఆ ఆలోచనలు అధిగమించానని ఉతప్ప తెలిపాడు.
2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా క్రికెట్ జట్టులో ఉతప్ప కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరపున 46 వన్డేల ఆడి ఆరు అర్ధ సెంచరీలు చేసి 934 పరుగులు చేశాడు. 13 టీ20ల్లో 249 పరుగులు చేశాడు. ఇండియాన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ రూ.3 కోట్లకు అతణ్ని కొనుక్కుంది. ఐపీఎల్ లో 177 24 అర్ధ సెంటర్లతో టీ20ల్లో 4411 పరుగులతో టాప్ లో ఉన్నాడు.