WBBL 2024: ఆస్ట్రేలియాలో ఇండియన్ బ్యాటర్స్ విజృంభణ... అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గెలిచిన జట్టు

Update: 2024-11-17 15:04 GMT

Jemimah Rodrigues Shines against Melbourne Stars in WBBL 2024 : టెస్టు సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అదే సమయంలో, మహిళల బిగ్ బాష్ మ్యాచ్‌లు కూడా అక్కడ జరుగుతున్నాయి. ఇందులో చాలా మంది భారతీయ క్రీడాకారులు కూడా ఆడుతున్నారు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడం ద్వారా తన జట్టు అద్భుతమైన విజయానికి బాటలు వేశారు జెమిమా రోడ్రిగ్జ్. తన జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశారు. WBBLలో, మెల్‌బోర్న్ స్టార్స్‌తో పోటీపడుతున్న బ్రిస్బేన్ హీట్స్ తరపున జెమిమా రోడ్రిగ్జ్ ఆడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన బ్రిస్బేన్ హీట్స్ జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనింగ్ జోడీ కేవలం 12 పరుగులకే తొలిదెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్‌ ఉమెన్ జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంపై ఆశలు నిలిపింది.

50 నిమిషాల బ్యాటింగ్, 31 బంతుల్లో 45 పరుగులు

ఈ మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్జ్ తన జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసింది. ఆమె 50 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 31 బంతులు ఎదుర్కొని 45 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. జెమీమా హాఫ్ సెంచరీకి 5 పరుగుల దూరంలో ఆమె ఇన్నింగ్స్ జట్టు విజయానికి ఉపయోగపడింది.

తొలి 15 బంతుల్లో 6 వికెట్ల తేడాతో విజయం

ఈ ఇన్నింగ్స్‌లో జెమీమా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేశారు. జట్టు స్కోరు 100 దాటగానే తన వికిట్ పడిపోయింది. బ్రిస్బేన్ హీట్స్ 15 బంతుల్లో 6 వికెట్ల తేడాతో మెల్‌బోర్న్ స్టార్స్‌ను ఓడించింది. జెమీమా కంటే ముందు 18 ఏళ్ల బౌలర్ లూసీ హామిల్టన్ బ్రిస్బేన్ హీట్స్ తరఫున 5 వికెట్లు పడగొట్టింది. 4 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఈ విజయాన్ని సాధించారు.

Tags:    

Similar News