IND Vs BAN: బంగ్లాదేశ్తో మూడోవన్డేలో భారత్ ఘన విజయం
IND Vs BAN: 227 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ
IND Vs BAN: బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తం 227 పరుగుల తేడాతో భారత్ విక్టరీ కొట్టింది. టీమ్ఇండియా బ్యాటర్లలో ఇషాన్కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగగా.. బౌలర్ల సహకారంతో టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సులు కొట్టాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. తర్వాత 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు... ఏ దశలోనూ పోరాడలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి క్రమంగా తప్పకుండా వికెట్లు కోల్పోయి 31 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లతో రాణించగా అక్సర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ చెరో 2, మిగతా బౌలర్లు తలో వికెట్ తీశారు.