SA vs IND: కేప్‌టౌన్‌లో టీమిండియాకు తొలి విక్టరీ.. రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ డ్రా.. ఎంఎస్ ధోనీ సరసన రోహిత్..!

SA vs IND: కేప్ టౌన్ టెస్టులో భారత్ రెండో రోజు 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో భారత్‌కు ఇదే తొలి టెస్టు విజయం.

Update: 2024-01-04 11:50 GMT

SA vs IND: కేప్‌టౌన్‌లో టీమిండియాకు తొలి విక్టరీ.. రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ డ్రా.. ఎంఎస్ ధోనీ సరసన రోహిత్..!

SA vs IND: కేప్ టౌన్ టెస్టులో భారత్ రెండో రోజు 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో భారత్‌కు ఇదే తొలి టెస్టు విజయం. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ 1-1తో ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు 79 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. దీంతో రోహిత్ సేన 3 వికెట్లు కోల్పోయి ఈ విజయం సాధించింది.

బుధవారం న్యూలాండ్స్‌ మైదానంలో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ కూడా తన తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 98 పరుగుల ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసింది. చివరి ఇన్నింగ్స్‌లో టీమిండియా 78 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో భారత్‌కు 79 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 12వ ఓవర్లో భారత్ ఈ ఘనత సాధించింది. అయితే, టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ ఓవర్లలో మ్యాచ్ ఫలితం తేలడంలో ఈ మ్యాచ్ అగ్రస్థానానికి చేరుకుంది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డిజార్జ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వేరియన్ (వికె), మార్కో యాన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి, నాండ్రే బెర్గర్.

Tags:    

Similar News