India vs Srilanka T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక మొదటి ఓవర్ లో మొదటి బంతికే పృథ్వీ షా వికెట్ తీసిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన సంజు శాంసన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తో కలిసి 50 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పి హసరంగా బౌలింగ్ లో శాంసన్ 27(20) ఎల్బీడబ్యు గా ఔట్ అయి పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన సూర్య కుమార్ యాదవ్ తనదైన ఆటతో అర్ధ సెంచరీ సాధించాడు. శిఖర్ ధావన్, సూర్య కుమార్ యాదవ్ మంచి భాగసౌమ్యం నెలకొల్పడంతో భారత్ మంచి పరుగులను సాధించింది. ఇక సూర్య కుమార్ యాదవ్ 50(34), శిఖర్ ధావన్ 46(36) పరుగుల వద్ద ఔట్ అయ్యాక బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్య 10(12) ఔట్ అవగా ఇషాన్ కిషన్ 20(14), క్రునాల్ పాండ్య 3(3) నాట్ ఔట్ గా నిలిచి భారత్ 164/5 పరుగులతో సరిపెట్టుకుంది.
ఇక శ్రీలంక బౌలింగ్ లో హసరంగా 4-28-2
చమీరా : 4-24-2
కరునరత్నే: 4-34-1