India vs Sri Lanka: శ్రీలంకతో మ్యాచ్ లు వాయిదా
IND vs SL: శ్రీలంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంవల్ల మ్యాచ్ లు వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
India vs Sri Lanka: నాలుగు రోజుల్లో ప్రారంభం కావాల్సిన ఇండియా, శ్రీలంక మధ్య జరిగే వన్డే- టి 20 వాయిదా పడింది. శ్రీలంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంవల్ల ఆజట్టు సభ్యులంతా క్వారంటైన్ లో వున్నారు. ఈ నేపథ్యంలో జూలై 13 నుంచి ప్రారంభం కావాల్సిన వన్డే మ్యాచ్ లను 17 నుంచి తిరిగి రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీ అధికారి వెల్లడించారు. లంక జట్టు మూడు రోజుల క్రితమే ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆటగాళ్లంతా ఇళ్లకు వెళ్లకుండా క్వారంటైలో ఉన్నారు.
తొలుత ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు గురువారం వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేశారు. దాంతో అతడికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ క్రమంలోనే జట్టు సభ్యులందరికీ శుక్రవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా డేటా అనలిస్టు నిరోషన్‌కు కూడా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దాంతో ఆటగాళ్లందరినీ ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించారు.
క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. జూలై 10న సిరీస్‌లో కొత్త తేదీల గురించి శ్రీలంక క్రికెట్ బోర్డు భారతదేశ క్రికెట్ నియంత్రణ మండలికి, దాని అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ కు తెలియజేస్తుంది. తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో వన్డే, టి 20 సిరీస్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.