IND VS NEP: క్రికెట్ చరిత్రలో తొలిసారిగా తలపడనున్న భారత్, నేపాల్ జట్లు.. ప్లేయింగ్ 11 నుంచి బుమ్రా ఔట్..!
Asia Cup 2023: ఆసియా కప్‌లో భాగంగా నేడు క్యాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, నేపాల్ మధ్య ఐదో మ్యాచ్ జరగనుంది. భారత టైమింగ్ ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది.
India Vs Nepal Playing 11: ఆసియా కప్‌లో భాగంగా నేడు క్యాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, నేపాల్ మధ్య ఐదో మ్యాచ్ జరగనుంది. భారత టైమింగ్ ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు టాస్ జరుగుతుంది.
భారత్ వర్సెస్ నేపాల్ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా ముఖాముఖిగా తలపడనున్నాయి. ఇంతకు ముందు ఇరుజట్లు క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనూ ఒకరినొకరు ఎదుర్కోలేదు. 2023 ఆసియా కప్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. వర్షం కారణంగా అసంపూర్తిగా నిలిచిన భారత్ తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో జరిగింది. అదే సమయంలో నేపాల్ మొదటి మ్యాచ్ కూడా పాకిస్తాన్‌తో జరిగింది. ఇందులో నేపాల్ జట్టు 238 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఏడుసార్లు ఛాంపియన్‌గా భారత్.. తొలిసారిగా అర్హత సాధించిన నేపాల్..
ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత జట్టు నిలిచింది. 6 వన్డేలు, ఒక టీ20 టోర్నీ ట్రోఫీతో సహా ఏడుసార్లు ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. నేపాల్ తొలిసారి అర్హత సాధించింది.
భారత టాప్ స్కోరర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది
నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడడం లేదు . కుటుంబ కారణాల వల్ల ముంబైకి తిరిగొచ్చాడు. 2023లో వన్డే క్రికెట్‌లో భారత్ తరపున శుభ్‌మన్ గిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గిల్ 12 మ్యాచ్‌ల్లో 760 పరుగులు చేశాడు. కాగా, కుల్దీప్ యాదవ్ 11 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
నేపాల్ టాప్ స్కోరర్‌గా కుశాల్..
టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కుశాల్ భుర్టెల్ ఈ ఏడాది 20 మ్యాచ్ ల్లో 552 పరుగులు చేసి నేపాల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలింగ్ గురించి మాట్లాడుతూ, సందీప్ లామిచానే టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అతను 20 మ్యాచ్‌లలో 43 వికెట్లు తీసుకున్నాడు.
89 శాతం వర్షం పడే అవకాశం..
సోమవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో పల్లెకెలెలో మేఘావృతమై ఉంటుంది. 89 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 21 నుంచి 27 °C వరకు ఉంటుంది.
పిచ్ నివేదిక..
పల్లెకెలెలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. పల్లెకెలె పిచ్ ఆరంభంలో స్పీడ్ అందించి ఫాస్ట్ బౌలర్లకు బౌన్స్ అందిస్తుంది. ఇది ఆట సాగుతున్నప్పుడు స్పిన్ బౌలర్లకు కూడా సహాయపడుతుంది.
ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ .
నేపాల్: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ భుర్టెల్, అర్జున్ సౌద్, ఆసిఫ్ షేక్, దీపేందర్ సింగ్ ఐరీ, భీమ్ షార్కీ, కరణ్ కెసి, కుశాల్ మాలా, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి, గుల్షన్ ఝా.